newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

అదంతా మోడీ, కేసీఆర్ కుట్రే!

02-05-201902-05-2019 16:11:17 IST
Updated On 02-07-2019 14:17:31 ISTUpdated On 02-07-20192019-05-02T10:41:17.267Z02-05-2019 2019-05-02T10:41:01.412Z - 2019-07-02T08:47:31.048Z - 02-07-2019

అదంతా మోడీ, కేసీఆర్ కుట్రే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబుపై దాఖలైన అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించడం రాజకీయంగా ప్రకంపనలు కలిగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలోనే ఈ కేసులో స్టే గడువు ముగిసింది. దీంతో స్టే పొడిగింపు లేకపోవడంతో విచారణ కొనసాగించాలని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు నిర్ణయించింది.  తదుపరి విచారణ మే 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 2005లో చంద్రబాబుపై ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఆర్జించారని ఆరోపించారు. అక్రమ సంపాదనతో భూములు,భవనాలు, షేర్లు కొన్నారని ఫిర్యాదు చేశారు. ఈకేసుపై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కేవలం చంద్రబాబునాయుడిని ఇబ్బంది పెట్టేందుకు కేసు వేశారని, ఎన్నికల ఫలితాల ముందు ఈ కేసు తెరపైకి రావడం వెనుక మోడీ, కేసీఆర్ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరైన చిరునామా, విశ్వసనీయత లేని వ్యక్తులు చేసే పనుల వల్ల చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ.

చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, సర్వేల పేరుతో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలని అవన్నీ ఎంత అబద్ధమో... మే 23న తేలిపోతుందని ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో పేర్కొన్నారు అనూరాధ. టీడీపీకి 110-120 సీట్లు రాబోతున్నాయని ఆమె అన్నారు. గతంలో కంటే రాయలసీమలో సీట్లు, ఓట్లు ఎక్కువగా వస్తాయన్నారు. గత ఏడాది కాలం నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపికతో చంద్రబాబు భరిస్తున్నారని, చంద్రబాబు కృషికి అన్నివర్గాలు మద్దతు ఇస్తున్నాయన్నారు అనూరాధ. 

Image result for anuradha panchumarthi

మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో టీడీపీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి సైతం ఏసీబీ కోర్టు, లక్ష్మీపార్వతి ఫిర్యాదు, స్టే ఎత్తివేత వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్, కేంద్రప్రభుత్వం కలిసి ఇబ్బందిపెడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు స్టే గడువు ఎప్పుడో ముగిసిందని, ఇప్పుడు ఆ సాకుతో ఏసీబీ కోర్టు విచారణ జరపడం రాజకీయ కక్ష సాధింపుచర్యే అన్నారు. చంద్రబాబుకి వస్తున్న ప్రజాదరణను చూడలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. మొత్తం మీద చంద్రబాబు-ఏసీబీ కోర్టు వ్యవహారం తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తోంది. మే 13వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి.  

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle