newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అత్యాచార నిందితుడికి వైసీపీకి బంధం? లోకేష్ సంచలన ట్వీట్

25-06-201925-06-2019 14:25:10 IST
Updated On 25-06-2019 14:25:28 ISTUpdated On 25-06-20192019-06-25T08:55:10.629Z25-06-2019 2019-06-25T08:55:06.107Z - 2019-06-25T08:55:28.074Z - 25-06-2019

అత్యాచార నిందితుడికి వైసీపీకి బంధం? లోకేష్ సంచలన ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒంగోలులో బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడికి వైసీపీకి సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సంబంధించిన ఫోటోలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ ట్వీట్ చేశారు. నిందితుడు వైసీపీ కండువాలు కప్పుకుని ఉన్న అతని ఫొటోలు పోస్ట్ చేస్తూ వైసీపీని టార్గెట్ చేశారు. ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు అంటూ లోకేష్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందన్నారు లోకేష్. 

Image may contain: 3 people, people smiling

నిందితుడి నేపథ్యాన్ని పార్టీలకు ఆపాదిస్తూ.. సోషల్ మీడియాలో కథనాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో జరుగుతోంది కూడా ఇటువంటిదే. నిందితుడు వైసీపీవాడంటూ టీడీపీ సోషల్ మీడియా వార్ స్టార్ట్ చేసింది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిదాడికి దిగుతోంది. గతంలో చంద్రబాబుతో పలువురు నిందితులు కలిసి దిగిన ఫొటోలని పోస్ట్ చేస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పదోతరగతి బాలికను నిర్బంధించి ఆరుగురు పదిరోజల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. షేక్ బాజీ అనే వికలాంగుడు ఈ మొత్తం ఘటనకు స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై స్పందించిన హోంమంత్రి సుచరిత నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. షేక్ బాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు లోకేష్. 

మరోవైపు ఒంగోలు అత్యాచార కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle