newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

అత్యంత సన్నిహితుడైన ఎల్వీతో ఇంత చెడిందేంటి?

05-11-201905-11-2019 11:19:08 IST
Updated On 05-11-2019 15:46:24 ISTUpdated On 05-11-20192019-11-05T05:49:08.099Z05-11-2019 2019-11-05T05:49:05.587Z - 2019-11-05T10:16:24.956Z - 05-11-2019

అత్యంత సన్నిహితుడైన ఎల్వీతో ఇంత చెడిందేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా విధుల నుండి తప్పించి బదిలీ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్. నిజానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహిత అధికారులలో ప్రథముడు. వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే ఎల్వీ ఆ కుటుంబానికి ఆప్తుడిగా మారగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులలో కూడా ఎల్వీ ప్రధముడిగా ఉన్నారు.

మొన్నటి 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారాలను దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సీఎస్ గా సుబ్రహ్మణ్యంను నియమించింది. స్వతహాగానే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఎన్నికల సమయంలో ప్రభుత్వ కీలక సమాచారాలను వైసీపీ పెద్దలకు పంపించారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయన చేసిన సేవలుకానీ.. సన్నిహితుడే కావడం కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా సిఎస్ గా ఆయననే కొనసాగించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏపీ ప్రభుత్వం-సీఎంఓకు మరో అధికారి ప్రవీణ్ ప్రకాష్ రాకతో ముసలం మొదలైంది. సీఎంఓలోకి పొలిటికల్ సెక్రటరీగా వచ్చిన ప్రవీణ్ జీవోలు జారీ చేసే అధికారాన్ని తనకు తాను దాఖలు పరుచుకోవడంతో మొదలైన ఇన్నర్ వార్ చివరికి సిఎస్ సుబ్రహ్మణ్యంను కార్యాలయం నుండి బయటకు పంపే వరకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈమధ్యనే జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రవీణ్ ప్రకాష్ సుబ్రహ్మణ్యం అధికారులకు ఖాతరు చేయకపోవడమే.

క్యాబినెట్ ఎజెండాలో సీఎస్ పొందుపరిచిన అంశాలను పక్కనబెట్టడమే కాక ప్రవీణ్ ప్రకాష్ తాను సొంతంగా కొత్త విషయాలపైను ఎజెండాలో చేర్చి క్యాబినెట్లో చర్చకు పెట్టారు. విధివిధానాలను ప్రవీణ్ పక్కనపెట్టేశారన్న కోపంతో సిఎస్ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారం రోజులలోగా ఎజెండాలోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అయితే సిఎస్ నోటీసులు ఇచ్చిన తర్వాత పనిదినంలోనే నోటీసులు అందుకున్న ప్రవీణ్ సిఎస్ ను బదిలీ చేయడమే సంచలనంగా మారింది.

గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి అధికారుల మధ్య ఆధిపత్య పోరు సీఎంఓ అధికారులకు తెలిసిందే కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యం పంచాయతీని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే సీఎం తన సలహాదారు అజేయ కల్లంతో చర్చించుకోవాలని సూచించగా ఇప్పుడు ఏకంగా బదిలీ వేటు పడింది. మరి ఇది సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అంటే అలా జరిగే అవకాశమే లేదని రాజకీయ వర్గాల భావనగా ఉంది.

మరి అంత విధేయుడిగా ఉన్న ఎల్వీ ఇప్పుడు ఎందుకు కానివాడిగా మారిపోయారు? ఆరునెలలోనే ఇంత చెడిందా? ఆప్తుడైన ఎల్వీకి ఎందుకింత అవమానం? వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజులలో ఏపీ రెసిడెంట్ కమిషనర్ గా అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన ప్రవీణ్ ప్రకాష్ ఏకంగా సీఎంఓలోకి ఎలా వచ్చారు. ఇంతలోనే అంత దగ్గర ఎలా అయ్యారు? నోటీసులు అందుకున్న వ్యక్తే సిఎస్ ను చేయడమేంటి? అసలు సీఎంఓలో ఏం జరుగుతుంది? సీఎం జగన్ ఉన్నతాధికారులపై పట్టుకోల్పోయారా? పట్టు బిగిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అధికార వర్గాలే సమాధానం చెప్పాలి!

 

 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle