ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

అతని కంటే ఘనుడు కేసీయార్- షో మ్యాన్ Vs హీ-మ్యాన్

18-12-201818-12-2018 13:49:49 IST
Updated On 18-12-2018 15:12:41 ISTUpdated On 18-12-20182018-12-18T08:19:49.068Z18-12-2018 2018-12-18T08:19:47.042Z - 2018-12-18T09:42:41.935Z - 18-12-2018

అతని కంటే ఘనుడు కేసీయార్-  షో మ్యాన్  Vs  హీ-మ్యాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగబోతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ తరహాలో చంద్రబాబు ఎన్నికల యుద్ధానికి వెళ్ళి విజయపతాక ఎగరేయగలరా? తనకు మించిన మేనేజ్‌మెంట్ గురు ఇండియాలోనే లేరని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ఎందుకు ఫెయిలైనట్టు? 2019లో ఏపీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? చంద్రబాబు ఎలా మేనేజ్ చేయగలరు? ఇనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ఈసందర్బంగా తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన విధానం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవలసిందే. 

సెప్టెంబర్ 6న అసెంబ్లీని అర్థంతరంగా రద్దుచేసి...కేసీఆర్ ఏవిధంగా ముందకెళ్ళారన్నది ప్రస్తావించదగిన విషయం. కేసీఆర్ పాటించిన టైమింగ్ అందరినీ ఇప్పుడు ఆలోచింపచేస్తోంది. ఎన్నికలకు ముందు వెళ్ళడం, ప్రభుత్వ వ్యతిరేకత గురించి ఆలోచించడం కంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్ని వేర్వేరు చేసి తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం అత్యవసరం అని ఆయన భావించారు. అలా చేసినప్పుడే లోక్‌సభ ఎన్నికల భారాన్ని మోయనవసరం లేదు. శాసనసభ ఎన్నికల మీదే తన దృష్టిని కేంద్రీకరించవచ్చు. తనను తాను గెలవడం అసెంబ్లీ ఎన్నికలకు అత్యవసరం. తన స్థానాన్ని తాను నిలబెట్టుకోవడం, తనను నమ్మినవారిని గెలిపించుకోవడం కేసీఆర్‌ ప్రాధాన్యతలు. ఈ విషయాలను అన్నింటినీ ఆయన ముందుగానే ఆలోచించి యుద్ధానికి అవసరమయిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. 

ఇక రెండో విషయం.. అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించడం, అందులో ఇంచుమించు సిట్టింగ్‌లు అందరికీ సీట్లివ్వడం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమయిన చర్య. అసెంబ్లీని రద్దుచేయాలనే ఆలోచన మనసులోకి రాగానే అభ్యర్ధుల గురించి కేసీఆర్ అంతకు ముందే అనుకున్న జాబితాని బయటపెట్టేశారు. ఈ 105 మంది అభ్యర్ధులను ఒక మీడియా సమావేశంలో ప్రకటించడం ఆషామాషీ విషయమేమీ కాదు. అటువంటి సిట్టింగ్‌ల పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయాలు, వ్యతిరేకత  అనే అంశాలు ఆయన దృష్టికి రాకుండా ఎందుకుంటాయి? అయితే ప్రజలు ఓట్లేసేది తనకేనని, అభ్యర్ధులకు కాదన్న భేషైన తర్కం కేసీయార్‌ది. తన పేరు చెబితే జనం ఓట్లేసేటప్పుడు అభ్యర్ధులు ఎవరైతే ఏంటి? సిట్టింగ్‌లనే నిలబెట్టి గెలిపించుకోగలననే ధీమా కేసీఆర్‌లో ఆరోజు కనిపించింది. నాయకుడికి ఉండాల్సిన ఒక  ప్రధానమైన లక్షణం ఇదే. ఇదీ కేసీఆర్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్. 

మూడో అంశం...తెలంగాణలో ఎన్నికలు కన్ఫమ్ అయిన తరవాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అసలు తెలంగాణకు రానని తెగేసి చెప్పారు. ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది తెలంగాణ టీడీపీ చూసుకుంటుందని అంటూ తేల్చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అటువంటి చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ గా ఎలా చేసుకోగలిగారు? స్వరాష్ట్రంలో గిరిగీసుకుని కూర్చుంటానన్న బాబుని కేసీయార్ తన ముగ్గులోకి ఎలా దింపారు? కేసీయార్ టార్గెట్‌గా ఒక ఉత్తమ్ కుమార్, మరో కోదండరాంలు పనికిరారు. వాళ్ళని విమర్శిస్తే జన స్పందన అంతగా ఉండదన్నది కేసీయార్ సూత్రీకరణ. మరి ఏ మోడీనో, రాహుల్‌నో టార్గెట్ చేసినా ప్రయోజనం లేదు. తన విమర్శ చంద్రబాబుపైన ఎక్కుపెట్టినప్పుడే అది సాధ్యమవుతుందన్న ఆలోచనే కేసీయార్‌ ప్రచార ఎజెండాగా మారిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది బాబు భజనపరులు, ఒకరిదదరు ఇంటెలిజెన్స్ అధికారులు బాబుకు ఇచ్చిన నివేదికే ఆయన కొంపముంచింది. కేసీయార్ కు ప్రజాభిప్రాయం అనుకూలంగా లేదని, మహా అయితే 20 సీట్లకు మించి కేసీఆర్ గెలవలేరని బాబుకి ఒక నివేదికను ఇచ్చారు. తెలంగాణ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా ఇచ్చిన ఆ నివేదిక మాయలో పడ్డ చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రచారానికి వచ్చేశారు. సరిగ్గా ఇదే కేసీయార్‌కు కలిసొచ్చింది.  వెదకబోతున్న తీగ కాలికి తగిలింది. తాను అనుకున్నట్టుగా బాబుని టార్గెట్ చేయడానికి చక్కని అవకాశం చిక్కింది. దొరికిందే తడవుగా ఆయన ఎన్నికల ప్రచార సభల్లో బాబుని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్ళి పోయారు. బాబు ప్రస్తావన లేకుండా ఏ ఉపన్యాసం లేకుండా ఇవ్వలేదు.  చంద్రబాబు ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నారని, ఒకవేళ చంద్రబాబుని గెలిపిస్తే అమరావతినుంచే పాలన సాగుతుందని, అసలు తెలంగాణలో చంద్రబాబుకి ఏం పని అంటూ ఘాటైన విమర్శల్ని ఎక్కుపెట్టారు. అవే విమర్శల్ని అటు కేటీఆర్, హరీష్‌లు కూడా తమ తమ సభల్లో చేయడంతో కేసీయార్ వ్యూహం ఫలించినట్టయింది. టార్గెట్‌గా బాబు అడ్డంగా దొరికిపోయారు.. ఇదీ విషయం. 

ఎన్నికలు ముందుకి జరపడం వల్ల ప్రత్యర్ధులు అయోమయంలో పడతారు. మహాకూటమి ఏర్పాటు.. భాగస్వామ్య పార్టీల మధ్య టికెట్లు కేటాయింపులో ఆలస్యం, బీఫారాలు ఇవ్వడంలో తాత్సారం, సీట్లకోసం కుమ్ములాటలు.. అన్నీ కేసీఆర్ ఊహించినట్టుగానే జరిగాయి. ప్రచారంలో మంత్రి కేటీఆర్ అన్నట్టు ‘మీరు సీట్లు పంచుకునేలోపు.. మేం స్వీట్లు పంచేసుకుంటాం’ అన్నది మహాకూటమి విషయంలో అక్షరాలా నిజమయింది. మరోవైపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు అనుసరించాల్సిన కనీస విధానం చంద్రబాబు పాటించలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గల్లీ మీటింగ్‌లు, ఓపెన్ టాప్ ప్రచారాలు చేయడం చంద్రబాబు లాంటి నాయకుడు చేయాల్సింది కాదంటున్నారు. ఏ పరేడ్ గ్రౌండో, ఎల్బీ స్టేడియంలోనో చంద్రబాబు బహిరంగసభలు పెట్టాల్సింది పోయి కూకట్‌పల్లి వీధుల్లో, శేరిలింగంపల్లి గల్లీల్లో తిరిగితే సరిపోతుందా? ఈ విషయంలో ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఘోరంగా ఫెయిలయ్యారనేది కాదనలేని సత్యం. దీంతో గ్రేటర్లో చంద్రబాబు పాత్ర నామమాత్రం అయిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. కనీసం తన మేనకోడలు నందమూరి సుహాసినిని కూడా చంద్రబాబు గట్టెక్కించలేకపోయారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ వ్యూహం వర్కవుట్ అయింది. అద్భుత ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. 

కేసీఆర్ సక్సెస్‌కి మరో కారణం 45 రోజుల ముందే ఎన్నికలకు సంబంధించిన సరంజామా ఆయా ఎమ్మెల్యేలకు చేరవేయడం, తనిఖీలకు దొరక్కుండా చేసిన అంగ, అర్థబలం ఆయా నియోజకవర్గాలకు పంపించడం. సిట్టింగ్‌లు, కొత్తవారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకెళ్ళాలో పక్కా ప్లాన్ తయారుచేసి ఇవ్వడం. ఒకట్రెండు చోట్ల పోలీసుల తనిఖీల్లో హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లాంటి వారి కార్లను తనిఖీ చేసినా ఏమీ దొరక్కపోవడం కేసీఆర్ మార్కు మేనేజెమెంట్‌కి నిదర్శనం. ఇదంతా ఒకఎత్తయితే కేసీఆర్ కుటుంబమే ఆయనకు గొప్ప ప్లస్ పాయింట్. కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు ఆయనకు వెన్నుదన్ను. కేసీఆర్ ఏం చెబితే దాన్ని పక్కాగా అమలుచేయడం వారు చేసిపెట్టారు. అద్భుత విజయం సాధించి కేసీఆర్‌కు అపూర్వ కానుక ఇచ్చారనే చెప్పాలి. వీటితో పాటు పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ విజయంలో భాగస్వాములయ్యారు. గతంలో చంద్రబాబులా కాకుండా కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల్ని సంతృప్తి పరచగలిగారు. ఓట్లు రాబట్టగలిగారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్ హవా సాగించిందంటే అదే కారణం. మొత్తం మీద కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు... చంద్రబాబు ఘోర వైఫల్యానికి అనేక అంశాలు దోహదం చేశాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle