newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

అట్టహాసంగా ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం

08-06-201908-06-2019 12:50:12 IST
Updated On 24-06-2019 14:15:05 ISTUpdated On 24-06-20192019-06-08T07:20:12.972Z08-06-2019 2019-06-08T07:20:11.424Z - 2019-06-24T08:45:05.542Z - 24-06-2019

అట్టహాసంగా ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ కేబినెట్లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11.49 గంటలకు ప్రారంభమైంది. వైసీపీ కేబినెట్‌లో జగన్ మొత్తం 25 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారంతా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నరసన్న పేట నుంచీ గెలిచిన ధర్మాన కృష్ణ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత చీపురుపల్లి నుంచీ గెలుపొందిన బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత కురుపాం నుంచీ ఎన్నికైన పాముల పుష్ప శ్రీవాణి ప్రమాణ స్వీకారం చేశారు. భీమిలీ నుంచీ గెలిచిన అవంతి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కాకినాడ రూరల్ నుంచీ గెలిచిన కురసాల కన్నబాబు ప్రమాణం చేశారు.

అనంతరం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ , పినిపె విశ్వరూప్, ఆళ్ళ నాని మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణం చేశారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రిగా ప్రమాణం చేశారు. కొడాలి నాని, తానేటి వనిత, పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణం చేశారు.

మోపిదేవి వెంకటరమణారావు, బాలినేని శ్రీనివాసరెడ్డి,  ఆదిమూలపు సురేష్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కళత్తూరు నారాయణస్వామి,  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌, షేక్‌ బేపారి అంజాద్‌ బాషాలు మంత్రులుగా ప్రమాణం చేశారు.  మొత్తం మీద జగన్ అన్ని సామాజిక వర్గాలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle