newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

అజ్ఞాతంలో మ‌రో టీడీపీ నేత‌.. ఇంత‌కీ ఎవ‌రికి భ‌య‌ప‌డి..?

08-11-201908-11-2019 16:12:53 IST
2019-11-08T10:42:53.573Z08-11-2019 2019-11-08T10:42:27.343Z - - 19-11-2019

అజ్ఞాతంలో మ‌రో టీడీపీ నేత‌.. ఇంత‌కీ ఎవ‌రికి భ‌య‌ప‌డి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం సీనియ‌ర్ నేత‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మాగంటి బాబుది ప్ర‌త్యేక శైలి. మాజీ ఎంపీ అయిన మాగంటి టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎక్క‌డ ఉన్నా సంద‌డిగానే ఉండేది. కానీ. ఇప్పుడు ఆ  సంద‌డే ఆయ‌న‌లో కరువైంద‌ని ప‌శ్చిమ‌గోదావ‌రి వాసులు అంటున్నారు. అందులో భాగంగ‌తానే ఈ ద‌ఫా ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వెలువ‌డిన నాటి నుంచి ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని, కొంత కాలంగా ఎవ్వ‌రికీ దొర‌క‌డం లేదన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ జిల్లాకు వ‌చ్చినా మాగంటి బాబు మాత్రం అడ్ర‌స్ లేకుండా వెళ్లిపోయారు. ఈ అంశ‌మే ఇప్పుడు జిల్లాతోపాటు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే, మాగంటి బాబు త‌ల్లిదండ్రులు గ‌త ప్ర‌భుత్వాల‌లో మంత్రులుగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి కూడా వైఎస్ కేబినేట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో టీడీపీలో చేరిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు కూడా. కానీ, ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా 2014లో విజ‌యం సాధించారు. తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు మాగంటి బాబు చ‌తికిల‌ప‌డ్డారు.

ఈ ఎన్నిక‌ల‌కు ముందు మాగంటి బాబు పోటీచేస్తారా..?  లేదా..? అన్న సందేహాలు వ‌చ్చినా.. చివ‌ర‌కు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. అయినా ఓడీపోయారు. ఓట‌మి ప‌ల‌క‌రించ‌డంతో మాగంటికి సైలెంట్ త‌ప్ప‌లేదు. అంతేకాకుండా త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ 50 రోజుల‌కు పైగా జైల్లో ఉన్నా క‌నీసం మాగంటి ఆయ‌న్ను చూసేందుకు వెళ్ల‌క‌పోవ‌డంపై కూడా ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త ఐదేళ్ల తెలుగుదేశం పాల‌న‌లో త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వలేద‌ని మాగంటి బాబు అప్ప‌ట్లో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చింత‌ల‌పూడిలో త‌న‌వ‌ద్ద ఉన్న నేత‌ల‌కు మార్కెట్‌యార్డ్ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డం, పోల‌వ‌రం ప్రారంభోత్స‌వంలో త‌న ఫోటో పెట్ట‌క‌పోవ‌డంపై అప్ప‌ట్లో మాగంటి బాబు సీరియ‌స్ అయ్యారు.

ఎన్నిక‌ల్లో పార్టీప‌రంగా త‌న‌కు స‌హ‌కారం అందలేద‌నే అసంతృప్తి మాగంటి బాబులో ఎక్కువ‌గా ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్న క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు ఇటీవ‌ల డుమ్మా కొట్ట‌డం నేర్చుకున్నారు. ఇత‌ర విష‌యాల‌ను చూపుతూ వ్య‌క్తిగ‌త ప‌నుల‌వ‌ల్లే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం లేదంటూ పార్టీ ముఖ్య నేత‌ల‌కు ఓ మెసేజ్ కొట్టి మ‌రీ డుమ్మా కొడుతున్నారు. అయితే, మాగంటి బాబు డుమ్మాకు ముఖ్య కార‌ణం వ్య‌క్తిగ‌త‌మా..?  లేక అల‌క వ‌హించారా..? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే 2024 నాటికి మాగంటి ప‌రిస్థితి ఏంటి..?  అన్న ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే వ‌య‌సు పైబ‌డ‌టంతోపాటు పెద్ద‌గా నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొనే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి అవ‌కాశం ఇప్పించుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే కొడుకు రాంజీకి కేడ‌ర్ న‌డిపించే స‌త్తా లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న మాగంటి బాబు ఎప్పుడు బ‌య‌ట‌కొస్తారు..? వస్తే పార్టీలో ఉంటారా..?  లేదా మెల్ల‌గా బీజేపీలోకి జంప్ అవుతారా..?  మాగంటి మ‌దిలో ఏముంద‌న్న చ‌ర్చ ఇప్పుడు ఏలూరులో జ‌రుగుతోంది.

 

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

   31 minutes ago


జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

   an hour ago


ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

   an hour ago


 ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

   2 hours ago


జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

   2 hours ago


పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

   3 hours ago


ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

   4 hours ago


‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

   4 hours ago


‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

   4 hours ago


శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

   6 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle