newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

12-06-202012-06-2020 13:04:02 IST
Updated On 12-06-2020 13:03:59 ISTUpdated On 12-06-20202020-06-12T07:34:02.837Z12-06-2020 2020-06-12T07:28:37.047Z - 2020-06-12T07:33:59.682Z - 12-06-2020

అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తారనే భయంతోనే అచ్చెన్నాయుడి అరెస్ట్ జరిగిందని, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.  వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడిని అడ్డుకోలేక, అధికారాలను ఉపయోగించి ఆయనపై తప్పుడు  కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు  వైసీపీ ప్రభుత్వంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని బాబు ఆరోపించారు.   బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎత్తి చూపుతున్న  అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు.  నిమ్మాడలో అర్ధరాత్రి అచ్చెన్నాయుడి ఇంటిపై 100 పోలీసులు దాడిచేసి  అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేసారని అన్నారు.  అచ్చెన్నాయుడిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియడం లేదని, ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లడం చట్టాల ఉల్లంఘన చర్య అవుతుందని బాబు పేర్కొన్నారు. 

టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత చంద్రబాబు కుడిభుజం అయిన అచ్చెన్నాయుడు కార్మికశాఖలో అవినీతికి పాల్పడిన ఆరోపణలో అరెస్ట్ కావడం టీడీపీ వర్గాల్లో కలవరపాటుకు గురిచేసింది. తెలుగుదేశం శాసనసభ్యులు  అచ్చెన్నాయుడుగారు ఏమయ్యారు? నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది?

ఆయన్ను 100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారు? అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలవారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు చంద్రబాబు. 

https://www.photojoiner.net/image/2abyWU41

హోంమంత్రి మేకతోటి సుచరిత  ఏమన్నారంటే...

విజిలెన్స్ దర్యాప్తు తరువాతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఫర్నిచర్ కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి.  రూ.150 కోట్ల ప్రజాధనంలో అవినీతి జరిగిందని వివరణ ఇచ్చారు హోమ్ మంత్రి సుచరిత . 

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle