newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

అచ్చెన్నా.. ఎందుకీ కడుపు మంట!

25-03-202025-03-2020 17:09:40 IST
Updated On 25-03-2020 17:10:37 ISTUpdated On 25-03-20202020-03-25T11:39:40.859Z25-03-2020 2020-03-25T11:38:24.709Z - 2020-03-25T11:40:37.183Z - 25-03-2020

అచ్చెన్నా..  ఎందుకీ కడుపు మంట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు సత్పలితాలు ఇవ్వడంతో తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్ధ ఛైర్మన్ , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు.అఙ్ఞానం, అహంకారంతో రాష్ట్రాన్ని శ్మశానం చేస్తున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎల్పీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ పై చేసిన విమర్శలను ఆయన ఖండించారు.

కరోనా వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అచ్చెన్నాయుడికి కడుపు మంటపుట్టిస్తున్నట్టుగా ఉందని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.నలభై ఏళ్ళ పొలిటికల్ ఇండ్రస్టీ అని చెప్పుకునే  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే అహంకారం ఎక్కువన్న సంగతి అచ్చెన్నాయుడికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏనాడైనా అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలను పాటించారా అని మల్లాది విష్ణు అడిగారు.

ఏ విషయంలో నైనా అధికారులిచ్చే సలహాలను కూడా  అమలు చేసే సంస్కారం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిజగన్  అన్నారు. తెలుగుదేశం పాలనలో  వచ్చిన తుఫాన్లు సమయంలో రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చింది చంద్రబాబేనని ఆయన విమర్శించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారందరికి కరోనా  లక్షణాలు ఉన్నాయో లేవో అని వైద్యాశాఖాధికారులు అన్ని పరీక్షలు చేశారన్నారు. వాళ్ళంతా ఎక్కడున్నారంటూ అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేయడాన్ని మల్లాది విష్ణు తప్పుపట్టారు.

కళ్ళుండి చూడలేని కబోధి మాదిరిగా తెలుగుదేశం నాయకులకు  రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలుకనిపిండంలేదన్నారు. క్వారంటైన్ తో కొత్తజబ్బులు వస్తున్నాయంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించడంలో వాస్తవంలేదన్నారు. కేవలం దుర్భుద్దితోనే ప్రభుత్వంపైవిమర్శలు చేస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో పేర్కోన్నారు.  విపత్కర పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన విపక్ష టీడీపీనాయకులు ప్రతి దాన్ని రాజకీయం చేయడమేపనిగా పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కరోనా విషయంలో జగన్ చేపడుతున్న చర్యలకు ప్రశంసలు లభిస్తుంటే.. విపక్షాలకు మాత్రం అవి కనిపించడంలేదన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle