newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

‘‘అచ్చెన్నాయుడిపై ఎందుకింత కక్ష? కోర్టు ఆదేశాలు కూడా పాటించరా?’’

30-06-202030-06-2020 17:50:10 IST
2020-06-30T12:20:10.382Z30-06-2020 2020-06-30T12:19:57.181Z - - 05-07-2020

‘‘అచ్చెన్నాయుడిపై ఎందుకింత కక్ష? కోర్టు ఆదేశాలు కూడా పాటించరా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు. అచ్చెన్నాయుడును కలవడానికి ఇవాళ కూడా అధికారులు అంగీకరించలేదని, ఆసుపత్రి అధికారులతో మాట్లాడి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామన్నారు. 

అచ్చన్నాయుడు పై కేసులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని చెప్పారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వచ్చారు. న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకు రాలేదని, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినా,  ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండానే నివేదిక ఇస్తున్నారన్నారు. 

కింది స్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్నారని ఎంపీ రామ్మోహననాయుడు విమర్శించారు. అచ్చెన్నాయుడుని ఎలాగైనా జైలులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి.. ఏసీబీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అర్థరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేసేందుకు యత్నించారన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

ఎర్రన్నాయుడు కుటుంబం నలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని, జగన్ పై పెట్టిన అక్రమ ఆస్తుల కేసు పిటిషన్ పై ఎర్రన్నాయుడు సంతకం చేశారని కక్ష గట్టారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు పై కేసు పెట్టి  అరెస్టు చేశారన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఇబ్బందులు పెడుతున్నారు. అచ్చెన్నాయుడును జైలుకు పంపేందుకు కుట్ర పన్నారన్నారు.

ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారని, అవినీతి బురదలో ఉన్న వైకాపా ప్రభుత్వం.. తమ పార్టీ నాయకుడిపై బురద చల్లుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle