newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. తొలివిడత చెల్లింపులు షురూ

19-10-201919-10-2019 10:58:12 IST
2019-10-19T05:28:12.041Z19-10-2019 2019-10-19T05:24:04.822Z - - 15-12-2019

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. తొలివిడత చెల్లింపులు షురూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అగ్రిగోల్డ్ బాధితులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న మంచిరోజులు త్వరలో రానున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తన ఎన్నికల హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వైయస్‌.జగన్‌ మరో ముందడుగు వేశారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలివిడత చెల్లింపులకు రంగం సిద్ధం అవుతోంది. రూ. 10వేల లోపు డిపాజిటర్లకు మొదట పేమెంట్లు రెడీ అవుతున్నాయి. 3 లక్షల 69 వేల 655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనుంది ప్రభుత్వం.హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేయనుంది. ఉన్నతన్యాయస్థానం ఆదేశాల ప్రకారం జిల్లా లీగల్‌సెల్‌ద్వారా చెల్లింపులు జరపనున్నాయి. 

రూ.20వేలలోపు డిపాజిటర్లకూ చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈమేరకు కోర్టు ఆదేశాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఉన్నత న్యాయస్థానం అంగీకారం రాగానే వీరికీ చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వం చెబుతోంది.

అగ్రిగోల్డ్ పై సమీక్ష సందర్భంగా ఆ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత వేలం ద్వారా ఆ సొమ్మును రికవరీ చేయాలన్నారు. బాధితుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చెల్లింపుల్లో జాప్యం జరగకూడదని సూచించారు. తాజా నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle