newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అగ్రిగోల్డ్ ..ఇప్పుడు ఓట్ల కాసుల్ని రాల్చుతోంది!!!

08-02-201908-02-2019 17:07:04 IST
Updated On 08-02-2019 17:27:29 ISTUpdated On 08-02-20192019-02-08T11:37:04.435Z08-02-2019 2019-02-08T11:26:50.761Z - 2019-02-08T11:57:29.366Z - 08-02-2019

అగ్రిగోల్డ్ ..ఇప్పుడు  ఓట్ల కాసుల్ని రాల్చుతోంది!!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా నిశ్శబ్ధంగా కాదు..బహిరంగంగా...నిస్సిగ్గుగా జరిగిపోతోంది.నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే జనం గుర్తుకు వస్తారు. వాళ్ళ సమస్యలు గుర్తుకొస్తాయి. అన్ని రాజకీయపార్టీలూ ఇప్పుడు వరాల  మూటల్ని విసిరేసే పనిలో పడ్డాయి. ఒకర్ని చూసి మరొకరు. ఒకర్ని కాపీ కొట్టి మరొకరు. ఇలా అంతే లేని ఈఉచిత హామీల ఖరీదును కట్టే షరాబులెవరు? 

గురువారం ఒక ముఖ్యమంత్రి.. ఇంకో కాబోతున్నాననుకుంటున్న మరో ముఖ్యమంత్రి కలిసి జనం మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటినిన్న మంత్రివర్గ సమావేశంలో పెట్టిన సంతకాల విలువ వందల కోట్లు దాటిపోయింది. అటు జగన్ మోహన్ రెడ్డి తన తిరుపతి సమర శంఖారావంలో డ్వాక్రా మహిళల రుణాల్ని రద్దు చేస్తామంటూ వరమిచ్చారు. 

చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిరుద్యోగులకు ఇస్తున్న వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని వంద శాతం పెంచి రెండువేలు చేశారు. ఇక రాష్ట్ర కాబినెట్ మీటింగ్ నిర్వహించిన బాబు అగ్రి గోల్డ్ బాధితుల్లో పదివేల రూపాయిల బకాయిలున్న వాళ్లందరికీ ప్రభుత్వం నష్టపరిహార చెల్లిస్తుందంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధితులు దాదాపు మూడున్నర లక్షలమంది ఉంటారని అంచనా. ఈ లెక్కన వీళ్ళ బకాయిలు చెల్లించాలంటే సుమారు మూడువందల యాభై కోట్ల రూపాయలపైనే ఖర్చవుతుందని లెక్క.

అసలీ వ్యవహారం మొత్తం కోర్టులో ఉంది. అగ్రి గోల్డ్ ఆస్తుల్ని అమ్మి బాధితులకు బకాయిలు చెల్లించాలని కోర్టు చెప్పింది. మరీ ఖజానా చెల్లింపులేంటన్నది  ప్రశ్న.  ఇక తాము అధికారంలోకి వస్తే ఇదే అగ్రి గోల్డ్ బాధితులందరికీ మొత్తం బకాయిలు చెల్లిస్తామంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్ గతంలోనే ప్రకటించారు. విచారకరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ బాధితుల సంఖ్య ఎంతన్న విషయంలో ఇదమిద్దంగా లెక్కలు లేవు.

అసలీ స్కాం విలువ రూ.6380 కోట్ల రూపాయల పైనే ఉంటుందని, 32 లక్షలమంది బాధితులు ఉన్నారన్నది గతంలో చెప్పిన సంఖ్య. దస్తావేజులు సరిపోలడంలేదన్న కారణంగా ఈ బాధితుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అగ్రిగోల్డ్ భూములను కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఆక్రమించారన్న అభియోగాలు కూడా ఉండనే ఉన్నాయి. 

ఈ అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని పక్కన పెడితే, ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్ధానాలు వేల కోట్ల రూపాయలు దాటిపోతున్నాయి. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంతో బాటు అక్కడ అధికారం కోసం వెంపర్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా విపరీతమైన ధోరణి ప్రదర్శిస్తోంది. రైతులకు నేరుగా పంట పెట్టుబడి కింద డబ్బు చెల్లించే పథకానికి తెలంగాణలో మొదలుపెట్టిన రైతుబంధు పధకం ఎన్ని లొసుగులున్నా ... ఇప్పుడు చాలా ప్రభుత్వాల్ని ఆకర్షిస్తోంది. మోదీ నుంచి మొదలుకొని, జగన్ దాకా ఇటువంటి పెట్టుబడి పథకాల్ని ప్రకటిస్తున్నారు.

ఇటీవలే చంద్రబాబు కూడా ఇదే అంశంపైన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. బడ్జెట్లో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి రూ.5వేల కోట్ల రూపాయల్ని కేటాయించారు కూడా! చంద్రబాబు ధోరణి చూస్తుంటే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని, ఓట్లు వేస్తేనే పరిహారం ఇస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నట్టుంది. అగ్రిగోల్డ్ గొడవ 2014లో మొదలై.. ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. నాలుగున్నరేళ్లపాటు కాలయాపన చేసిన బాబు, హఠాత్తుగా వారిపై ఎక్కడలేని ప్రేమ చూపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle