newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

అఖిల‌ప్రియ‌కు మ‌రిన్ని తిప్ప‌లు..!

27-07-201927-07-2019 08:07:28 IST
Updated On 27-07-2019 14:02:45 ISTUpdated On 27-07-20192019-07-27T02:37:28.678Z27-07-2019 2019-07-27T02:37:20.425Z - 2019-07-27T08:32:45.512Z - 27-07-2019

అఖిల‌ప్రియ‌కు మ‌రిన్ని తిప్ప‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి ఉన్న స్థానం అంద‌రికీ తెలిసిందే. మూడు ద‌శాబ్దాలు నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలో, ముఖ్యంగా ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భూమా కుటుంబం చ‌క్రం తిప్పుతోంది. భూమా వీర‌శేఖ‌ర్ రెడ్డి, భూమా భాస్క‌ర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి సోద‌రులు ఈ ప్రాంతంలో బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదిగారు. వీర‌శేఖ‌ర్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి మ‌ర‌ణంతో భూమా నాగిరెడ్డి రాజ‌కీయాల్లో కీల‌కం అయ్యారు.

ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లోనూ ఆరితేరి ప్ర‌త్య‌ర్థుల‌ను ధీటుగా ఎదుర్కున్నారు భూమా సోద‌రులు. ముఖ్యంగా నాగిరెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భూమా శోభా నాగిరెడ్డి క‌ర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత‌టి వైభ‌వం క‌లిగిన భూమా కుటుంబ వార‌సులు ఇప్పుడు రాజ‌కీయంగా క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కుంటున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన నాగిరెడ్డి, ఆయ‌న కూతురు అఖిల‌ప్రియ త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

కేసులు, ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు భ‌రించ‌లేకనే వీరు అప్ప‌టి అధికార పార్టీలోకి చేరార‌నే ప్ర‌చారం ఉంది. పైగా మంత్రి ప‌ద‌వి హామీ కూడా ఉండ‌టంతో వైసీపీకి దూర‌మ‌య్యారు. నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత భూమా వార‌సులు రాజ‌కీయంగా ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నారు. త‌ర్వాత అఖిల‌ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కినా, నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం సాధించినా భూమా నాగిరెడ్డి వ‌ర్గీయులు మాత్రం వీరికి క్ర‌మంగా దూర‌మ‌వుతున్నారు.

భూమా నాగిరెడ్డికి కుడిభుజంలా ఉండే ఏవీ సుబ్బారెడ్డి భూమా వార‌సుల‌కు దూర‌మ‌య్యారు. దీంతో చాలా మంది నాగిరెడ్డి అనుచ‌రులు సుబ్బారెడ్డి వ‌ర్గంగా మారిపోయారు. వీరి మ‌ధ్య అనేక చ‌ర్చ‌లు జ‌రిపి స‌యోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు ప్ర‌య‌త్నించారు. అయినా వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌చారం ఉంది. ఇక‌, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో భూమా కుటుంబానికి దారుణ ఓట‌మి ఎదురైంది. కంచుకోట లాంటి ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిలప్రియ‌, నంద్యాల‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి భారీ తేడాతో ఓట‌మి పాల‌య్యారు.

అయితే, జ‌గన్ ప్ర‌భంజ‌నం వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, త‌మ త‌ప్పులు ఏమీ లేవ‌ని అఖిల‌ప్రియ స‌మ‌ర్థించుకుంటున్నారు. కానీ, అఖిల‌ప్రియ త‌ప్పుల వ‌ల్లే వారు దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నార‌నే ప్ర‌చారం టీడీపీ వ‌ర్గీయుల్లోనే ఉంది. మంత్రి అయ్యాక ఆమె భూమా వ‌ర్గీయుల‌ను ప‌ట్టించుకొలేద‌నేది ఆమెపై ప్ర‌ధాన ఆరోప‌ణ కాగా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ‌రామ్ జోక్యం కూడా తీవ్రంగా న‌ష్టం చేసింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా అఖిల‌ప్రియ‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. స్థానికంగా మంచి ప‌ట్టున్న భూమా భాస్క‌ర్ రెడ్డి కుమారుడు భూమా కిషోర్ రెడ్డి టీడీపీని వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. వెళుతూ.. త‌న సోద‌రి అఖిల‌ప్రియ వైఖ‌రిపై, భార్గ‌వ్ రామ్ ప్ర‌మేయంపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇప్ప‌టికే భూమా వ‌ర్గంలో స‌గం మంది దూరం కావ‌డం, తాజాగా కిషోర్ రెడ్డి కూడా వెళ్లిపోవ‌డం అఖిల‌ప్రియ‌కు భ‌విష్య‌త్‌లో మ‌రింత ఇబ్బందిక‌రంగా మార‌నుంది.  

 


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle