newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

17-02-202017-02-2020 08:08:14 IST
2020-02-17T02:38:14.931Z17-02-2020 2020-02-17T02:37:54.586Z - - 05-04-2020

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో అమ్మాయిలంటే కొంతమంది స్కూలుకి పంపేవారు. స్కూలు దూరంగా ఉంటే ఇంటికే పరిమితం చేసేవారు. కొంతమంది నిరుపేద తల్లిదండ్రులు పనులకు పంపేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. బాలికల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో బాలికా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలిచింది.

దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తమ సత్తా చాటుకుంటున్నారు. 19 ఏళ్లలోపు అమ్మాయిల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించింది ఏపీ. వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన అమ్మఒడి, నాడు నేడు, వివిధ అక్షరాస్యతా పథకాలు, ఇంగ్లీష్ మీడియం ద్వారా మరింతగా ప్రమాణాలు పెరుగుతున్నాయి. 

మహీంద్రా అండ్‌ మహీంద్ర, నాంది ఫౌండేషన్‌ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 600కు పైగా జిల్లాల్లో సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. బాలికల్లో అక్షరాస్యత పెంచడం ద్వారానే వివిధ ఆరోగ్యపద్థతుల గురించి అవగాహన పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. బాలికా విద్యకు పెద్దపీట వేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉందని సర్వేలో తేలింది. 

‘ది టీన్‌ ఏజ్‌ గర్ల్స్‌ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా పరిశోధన నిపుణులు, లింగ నిష్పత్తి గణాంక నిపుణులు, సామాజిక, మానవ శాస్త్ర అధ్యయన నిపుణులు, న్యాయవాదులు, మానసిక ఆరోగ్య నిపుణులతో మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్‌ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 

అమ్మఒడి పథకం పేరుతో తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈ పథకం కారణంగా తమ పిల్లల్ని బడికి పంపించాలన్న ఆసక్తి ప్రతి తల్లిలోనూ పెరిగింది. అదేవిధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో టాయిలెట్లు, రక్షణ గోడలు, తరగతి గదుల నిర్మాణం మొదలైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. 

కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కృషి కారణంగా బాలికా విద్యకు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయి. ఏపీ బాలికల్లో 96.6 శాతం మందికి 19 ఏళ్లలోపు వివాహాలు చేయకుండా చదివిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఈ శాతం 88.9గా నమోదైంది.  86.6 శాతం మంది టీనేజ్‌ బాలికలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో వున్నారు. రాష్ట్రంలో 71 శాతం మంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు. 81.5 శాతం ఏపీ బాలికలు ఇంగ్లీష్, కంప్యూటర్‌ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ఇంటర్మీడియెట్ తర్వాత అమ్మాయిలు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి, విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

70 శాతం మంది ఏపీకి చెందిన టీనేజీ బాలికలు తాము చదువుకుంటున్న విద్యకు అనుగుణంగా ఉపాధి పొందాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఏపీలో 82.8 శాతం బాలికలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా సరైన పద్ధతులు పాటిస్తున్నారని సర్వే వెల్లడించింది. 56.4 శాతం మంది టీనేజీ బాలికలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారని, దీంతో అనేక ఇబ్బందులు తొలగిపోతున్నాయని తేలింది. 

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   12 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   13 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   15 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   16 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   19 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle