ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-2

26-04-201926-04-2019 07:55:12 IST
Updated On 26-04-2019 18:10:36 ISTUpdated On 26-04-20192019-04-26T02:25:12.728Z26-04-2019 2019-04-26T02:25:00.466Z - 2019-04-26T12:40:36.675Z - 26-04-2019

అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నం ఉత్తర స్థానం నుంచి ఈసారి మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో నిలిచారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, ప్రముఖ నేతగా గుర్తింపు ఉండటం, డబ్బు ఎక్కువగా ఖర్చుపెట్టడం వంటి అంశాలు ఆయనకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీపై బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు 18 వేల ఓట్లతో గెలిచారు. ఈసారి ఇక్కడ చతుర్ముక పోటీ ఉన్నా గంటా వైపే మొగ్గు ఉంది. అయితే, వైసీపీ నుంచి పోటీ చేసిన కేకే రాజు అందరూ ఊహించినదానికంటే గట్టి పోటీ ఇచ్చారు.

విశాఖపట్నం దక్షిణంలో ఈసారి టఫ్ ఫైట్ నడిచింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంపై ఆయన మంచి పట్టు సాధించారు. అయితే, ఈసారి వైసీపీ ద్రోణంరాజు శ్రీనివాస్ ను కాంగ్రెస్ నుంచి చేర్చుకొని టిక్కెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తండ్రికి ఇక్కడ మంచి గుర్తింపు ఉంది.

ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా కలిసివస్తాయి. అయితే చివరి నిమిషంలో టిక్కెట్ రావడం ఆయనకు మైనస్ అయ్యింది. జనసేన కూడా బాగానే ఓట్లు సాధించే అవకాశం ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ - వైసీపీ మధ్యే ఉంది. ఇక్కడ ఇద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే వచ్చే అవకాశం ఉంది.

 విశాఖపట్నం పశ్చిమ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గణబాబు 30 వేలకు పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి దాడి రత్నాకర్ పై గెలిచారు. దాడి రత్నాకర్ ది నాన్ లోకల్ కావడం, బీజేపీ, జనసేనతో పొత్తు టీడీపీకి కలిసివచ్చింది. ఈసారి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయ్ ప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు కూడా ఇక్కడ గట్టి పట్టుంది.

దీంతో టీడీపీ - వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగింది. ఇక్కడ మొగ్గు టీడీపీ వైపే కనిపిస్తున్నా పోలింగ్ సరళి చూశాక వైసీపీకి కూడా విజయావకాశాలు లేకపోలేదనే అంచనాలు కలిగాయి. మొత్తంగా విశాఖపట్నం నగరంలోని నాలుగు సీట్లలో టీడీపీ కనీసం మూడు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-1 https://www.newssting.in/p/5cc26a577a710d0759a8c453


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle