newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-1

26-04-201926-04-2019 07:48:20 IST
Updated On 26-04-2019 18:09:31 ISTUpdated On 26-04-20192019-04-26T02:18:20.300Z26-04-2019 2019-04-26T02:17:59.072Z - 2019-04-26T12:39:31.299Z - 26-04-2019

అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర‌వ్యాప్తంగా ఏయే జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో లెక్క‌లు క‌ట్టుకుంటున్నారు ఆయా పార్టీల నేత‌లు. గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల‌ను బేరీజు వేసుకుంటూ ఈసారి త‌మ‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయో ఒక అంచ‌నాకు వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు సాధించిన అనంత‌పురం, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈసారి తాము బాగా పుంజుకున్నామ‌నేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్క‌.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ స‌త్తా చాటిన విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో మాత్రం ఈ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నగరంలోని నాలుగు సీట్లలో మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీలతో గెలుచుకుంది. మిగతా ఒక్క స్థానాన్నీ టీడీపీ మిత్రపక్షంగా బీజేపీ దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ విడిగా పోటీ చేస్తున్న టీడీపీకే విశాఖపట్నం నగరంలో మొగ్గు కనిపిస్తోంది.

ఎక్కువగా ఉద్యోగులు, విద్యావంతులు, మధ్య తరగతి ప్రజలు, ఏ పార్టీకీ అనుకూలంగా ఉండని తటస్థులు, ఉత్తరభారతం నుంచి వచ్చి స్థిరపడిన వారు విశాఖపట్నం నగరంలో ఉంటారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా వీరు ఎక్కువగా టీడీపీ - బీజేపీ కూటమికే మద్దతుగా నిలిచారు. దీంతో విశాఖపట్నం రూలర్ జిల్లాలో వైసీపీ కొంత ప్రభావం చూపినా నగరానికి వచ్చే వరకు చతికిలపడింది.

విశాఖపట్నం తూర్పు నుంచి గత ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణ బాబు ఏకంగా 47 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వైసీపీ ఇక్కడ కొత్త అభ్యర్థి అయిన విజయనిర్మలను నిలబెట్టింది. అయితే, ఆమె నియోజకవర్గానికి కొత్త. దీంతో టిక్కెట్ ఆశించిన వారు మొదట్లో ఆమెకు పనిచేయకుండా మొండికేశారు. స్థానికేతరురాలు అనే ముద్ర కూడా పడింది. దీంతో ఈసారి ఆమెకు ఇక్కడ ఎదురుగాలే వీచిందనే అంచనాలు ఉన్నాయి. అయితే, బీజేపీ, జనసేనలతో పొత్తు లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కారణంగా రామకృష్ణబాబు మెజారిటీ మాత్రం భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. (ఇంకా ఉంది)

ఇది కూడా తప్పక చదవండి... అక్క‌డ ఈసారి కూడా టీడీపీది జైత్రయాత్రేనా-2 

 https://www.newssting.in/p/5cc26bfc7a710d0759a8c459


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle