newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

అక్కడ సైకిల్‌కు ఎదురుగాలి.. అయినా ఒప్పుకోని బాబు!

12-05-201912-05-2019 09:12:24 IST
2019-05-12T03:42:24.339Z12-05-2019 2019-05-12T03:42:13.534Z - - 26-06-2019

అక్కడ సైకిల్‌కు ఎదురుగాలి.. అయినా ఒప్పుకోని బాబు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఏం జరుగుతోంది? నియోజకవర్గాల సమీక్షల్లో చంద్రబాబు నేతలు చెబుతున్నది పట్టించుకోవడం లేదా? నేతల కంటే స్వంత సర్వేలనే బాబు నమ్ముతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీకి ఆయువు పట్టులాంటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఈసారి కొంప ముంచుతాయని నేతలు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తంచేశారట. అయితే చంద్రబాబు అవన్నీ పట్టించుకోకుండా తన సహజ ధోరణిలో ముందుకెళ్ళడం తెలుగు తమ్ముళ్ళకు రుచించడం లేదు. 

ఉత్తరాంధ్రలో విశాఖ మినహాయిస్తే మిగతా జిల్లాలలో అధినేత చంద్రబాబు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమీక్షలో ఈ విషయం స్పష్టమైందని అంటున్నారు. ఇక్కడి నుంచి పలువురు అభ్యర్థులు నివేదికలు కూడా తయారుచేయలేదు. కేవలం క్లుప్తంగా చంద్రబాబుకు పరిస్థితులను వివరించారని చెబుతున్నారు. అయితే తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ నేతలు ఎవరూ బల్లగుద్ది చెప్పలేకపోతున్నారు. 

అయితే నేతల నివేదికలు, వారి విశ్లేషణలు విన్న చంద్రబాబు ఎప్పటిలాగే శ్రీకాకుళంలో తామే గెలుస్తామని, రాష్ట్రంలో దాదాపు 110 నుంచి 120 వరకు సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ శ్రేణులకు వివరించారని తెలిసింది.

వైఎస్ఆర్ సీపీ విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిందని, ఆ డబ్బులు తీసుకున్నవారంతా తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని, అందుకు తమ సంక్షేమ పథకాలే కారణమని చెప్పినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు చెబుతున్న లాజిక్ ఎవరికీ అర్థంకాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

చంద్రబాబు పైకి గంభీరంగా ఏం మాట్లాడినా, నివేదికలను చూసి లోలోపల ఒకింత ఆందోళనకు గురవుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సమీక్షల్లో కొన్ని ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి.

సంక్షేమ పథకాల లబ్ధిదారులను పోలింగ్ కేంద్రాల వద్దకు నడిపించి టీడీపీకి ఓట్లు వేయించడంలో క్షేత్రస్థాయి నేతలు విఫలమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంచుమించు అన్ని జిల్లాల నేతలకు ఇదే అనుభవం ఎదురైంది. . ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయని తాజాగా అందుతున్న నివేదికలు కూడా చంద్రబాబులో కలవరం కలిగిస్తున్నాయి. 

ఈరెండు జిల్లాల్లో కలిపి గతంలో 5 సీట్లే వైసీపీకి వచ్చాయి. ఈసారి సీన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటని బాబు తెగ మధనపడుతున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉండగా, ఇప్పుడు 20 సీట్ల వరకూ వైసీపీ ఖాతాలోకి వెళతాయని అంటున్నారు. అదే జరిగితే బాబు చెబుతున్నట్టు 110-120 స్థానాల టీడీపీ  లెక్క బొక్కబోర్లాపడడం ఖాయం.

ఇదంతా ఒక ఎత్తయితే స్థానిక నేతలు ఇచ్చే నివేదికల మీద నమ్మకం కుదరని చంద్రబాబు పదే పదే వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకోవడం వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. మే 23న ఏం జరుగుతుందోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆ తేదీ గుర్తుకు వచ్చినప్పుడల్లా తెలుగు తమ్ముళ్ళకు వణుకు ప్రారంభమవుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle