newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అక్కడ వర్కవుట్ కానిది ఇక్కడ పండుతుందా?

10-01-201910-01-2019 18:40:24 IST
2019-01-10T13:10:24.697Z10-01-2019 2019-01-10T12:10:23.538Z - - 21-08-2019

అక్కడ వర్కవుట్ కానిది ఇక్కడ పండుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో మహాకూటమి పేరుతో విఫల ప్రయోగం జరిగింది. ఈ ఘోర ఓటమినుంచి మాత్రం ప్రధాన పార్టీలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కూటమి తిరిగి పోటీకి సై అంటోంది. మహాగట్బంధన్‌లో భాగంగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు పొత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయడమా, కాంగ్రెస్‌ను కాదని స్వతంత్రంగా పోటీ చేయడమా తేల్చుకోలేకపోయారు చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడి కసరత్తు పూర్తి అయ్యింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికే చంద్రబాబునాయుడు సుముఖత వ్యక్తంచేశారని సమాచారం.

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు-రాహుల్ కాసేపు ఏపీ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. పనిలో పనిగా చంద్రబాబు.. రాహుల్ గాంధీకి శాలువా కప్పి సన్మానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సంప్రదాయానికి విరుద్ధం. ఢిల్లీలో చంద్రబాబుకి శాలువా కప్పాల్సింది రాహుల్ గాంధీ. కానీ చంద్రబాబు మాత్రం రాహుల్‌కే తిరిగి శాలువాలు కప్పి సన్మానాలు చేయడం ఏపీ రాజకీయవర్గాల్లోనే కాదు, హస్తినలోనూ చెవులు కొరుక్కునేలా చేస్తోంది. ఏపీ వరకూ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీచేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఇటీవలే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో పొత్తు అవసరమే అంటూ.. ఏయే స్థానాలు కావాలో కూడా ఒక నివేదికను రాహుల్ గాంధీకి ఇచ్చినట్టుగా చెప్పారు. రఘువీరా జాబితా ప్రకారం రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపారని అంటున్నారు. 

175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలున్న ఏపీలో కాస్త గౌరవప్రదంగా సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 119 స్థానాల్లో టీడీపీకి దక్కింది మాత్రం 14 స్థానాలే. అందులో రెండుస్థానాలు మాత్రమే గెలిచింది. ఏపీసీసీ వర్గాల కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పాతిక ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లను కోరుతోంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల తరఫున ఎవరెవరు ప్రచారం చేయాలనేది కూడా చర్చకు వచ్చింది. ఎమ్మెల్యే బాలయ్యతో పాటు మరికొందరు సినీతారల్ని ప్రచారానికి వినియోగించాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో ప్రచారానికి సినీ స్టార్లు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎవరి తరఫున ప్రచారం చేసినా వారి మనిషిగా ముద్ర పడితే ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని సినీ స్టార్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రచారానికి దూరంగా ఉండేందుకే వారు మొగ్గు చూపుతున్నారు. ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన బరిలో ఉండబోతోంది. అయినప్పటికీ ఆయన పార్టీ తరఫున ప్రచారానికి వచ్చేందుకు స్టార్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏపీలో ప్రచారానికి సినీ గ్లామర్ లేకుండా పోతుందని అభిమానులు అసంతృప్తికి గురవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle