newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

అక్కడంతా కమ్మోళ్లేనన్న ప్రచారం నిజమేనా?

07-02-201907-02-2019 08:40:48 IST
Updated On 07-02-2019 11:20:59 ISTUpdated On 07-02-20192019-02-07T03:10:48.187Z07-02-2019 2019-02-07T03:06:50.433Z - 2019-02-07T05:50:59.396Z - 07-02-2019

అక్కడంతా కమ్మోళ్లేనన్న ప్రచారం నిజమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సగం నిజాల్ని లేదా పూర్తి అబద్దాలనీ ప్రచారం చేయడానికి సోషల్ మీడియా పనికొస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీద బురదజల్లడానికి రాజకీయ పార్టీలకు ఈ సామాజిక మాధ్యమం బలమైన ఆయుధంగా మారింది. ఏపీలో ఉన్న 14 విశ్వవిద్యాలయాల్లో  వైస్ ఛాన్సలర్లూ, రిజిస్ట్రార్  ఉద్యోగాల్లో నియమితులైన ప్రొఫెసర్లలో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది నిజమా ? ( ఆ వార్త కాపీని ఇక్కడే చూడవచ్చు) దీనిని  విచారించిన న్యూస్ స్టింగ్ బృందం తేల్చిన నిజాలు ఇవి: 

రాష్ట్రంలో 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్నది ఆ వార్తలో ఉన్న మొదటి తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర యూనివర్సిటీల సంఖ్య 20, మిగతా అయిదు డీమ్డ్ యూనివర్సిటీలు. ఏపీలో కేంద్ర విశ్వవిద్యాలయం లేదు. ప్రైవేటు యూనివర్సిటీలు కూడా లేవు. (వాటి వివరాలు కూడా ఇక్కడే పొందుపరుస్తున్నాం) ఇక అక్కడ ఉన్న వీసీలు రెజిస్ట్రార్లూ అందరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారేనంటూ చెప్పడానికి ప్రాతిపదికలు లేవు. కొన్నిచోట్ల క్షత్రియులు, ఎస్సీఎస్టీలు కూడా వీసీలుగా ఉన్నారు. ముస్లిం మతానికి. క్రిస్టియన్ కూడా అత్యున్నత స్థానంలో ఉన్నారు. అయితే  యూనివర్సిటీల్లో  ఇంచార్జీలుగా విధుల్లో ఉన్నవారే ఎక్కువ.

నాలుగైదు రోజుల క్రితమే జగన్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులో  37  మంది ఉన్నతోద్యోగాల్లో నియమితులైతే అందులో 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వైస్సార్సీపీ ప్రకటించింది కూడా! అయితే ఇందులో నిజం లేదని తేలింది. మొత్తం 37 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంటూ లెక్కలు బయటకొచ్చాయి. ఇదిలా ఉంటే ఏపీ డీజీపీ ఆర్ఫీ ఠాకూర్ పోలీస్ డిపార్టుమెంటుకు సంబంధించిన నియామకాల్లో కుల ప్రస్తావన తీసుకురావడాన్ని ఖండిస్తూ ప్రకటన కూడా చేశారు. 

సోషల్ మీడియాలో అవాస్తవాలు వార్తలుగా ప్రచారమవుతున్న నేపథ్యంలో 'ఫేక్ న్యూస్' పై ఒక ఉద్యమమే మొదలైంది. కాకపోతే అన్ని రాజకీయపక్షాలూ తమతమ సామాజిక మాధ్యమాల  ద్వారా ప్రమాదకరమైన విషయాల్ని విస్తృత ప్రచారం మొదలుపెట్టాయి. ముఖ్యంగా మతపరమైన సంస్థలు వాటికి అనుబంధంగా ఉన్న పార్టీలు దేశంలో సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపుతున్నాయని తేలింది. మరి ఇటువంటి వార్తల్ని ప్రచారం చేసేది ఎవరైనా ఆయా పార్టీల మీదకే నెపం నెట్టేసే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో  కులప్రస్తావనలపై జగన్ నేరుగా ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడీ విశ్వవిద్యాలయ  నియామకాల్లో కమ్మ కులస్తులకే అత్యధిక పోస్టులు దక్కాయన్న వార్త కూడా ఆ పార్టీనే ప్రచారం చేస్తోందన్న అభిప్రాయం కలిగే అవకాశాలు ఉన్నాయి.

అసలు వాస్తవాలు ఇవిగో:

1. SV University VC- prof. Rajendra Prasad- Kapu - Rector Prof. Janakiram - BC - Registrar  Prof. Anuradha - Kamma 

2. Dravida University VC- Prof. Yedla Sudhakar - SC-Madiga - Registrar-Prof.penchalaiah- SC - Mala.

3. Yogi Vemana University VC- prof. Ramachadra Reddy - Reddy

4. SKD University Anantapuramu- Prof. Rahmathulla- Muslim-Rector-Prof.Sudha-Registrar-Prof. Sudhakar Babu-Kamma.

5. Rayalaseema University - Kurnool - VC-Prof. Prasad Rao - SC-Madiga-Registrar-Prof.Amaranath - Kapu.

6. JNTUA Anantapuramu -VC-Prof. Srinivasa Kumar - visya community- Rector-Prof. Prahlada Rao-Brahmin-Registrar-Prof. Krishnaiah - kamma.

7. ANU - Guntur- Incharge VC - prof. Ramgi - kalinga- Rector-Prof. Janu palu -SC-Madiga- Incharge Registrar Prof. K. Rosaiah - kamma

8. Krishna University-Incharge VC-prof. Ramachandra Raju - Rajulu- Incharge Registrar- Prof. Usha kamma.

9.JNTUK Kakinada - VC prof.Ramalinga Raju- BC- Mangali-Registrar - Prof. Subbarao - BC - chakali

10. Dr. B.R. Ambedkar University - sreekakulam- Prof. Ramgi - Kalinga-Registrar Prof. Raghu Babu - BC - koppari velama.

11. Andhra University - VC - Prof. Nageswara Rao- BC - Kummari- Rector-Prof. Prasad Rao - SC - Mala-Registrar - Prof. Niranjan - kapu.

12. Nannayya University-Rajamandhry- Incharge VC- prof.prasada Rao- SC - Madiga- Registrar- Prof. Teki Surayya-BC - Chakali.

13. Sri padmavathi Mahila University- Thirupathi - Incharge VC-prof. Sudharsana Rao- kapu - Registrar- Prof Vijaya Lakshmi - BC - kurama.

14. Vikrama shimhapuri University - Nellore- VC - prof. Sudharsana Rao- kapu- Registrar- Prof. Prasad - BC - Chakali.

15. RGUKT-IIIT Nuziveedu VC-Prof. Ramachandra Raju- Rajulu - Niziveedu Director- Prof Das - SC - Mala-Ongole Director- Prof. Narashimha Raju- rajulu - Idupulapaya Director - Prof. H. Sudharsana Rao - BC - arekatika- Srikakulam Director -Prof. Hara Sreeramulu - kapu

No photo description available.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle