newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

అంద‌రూ క‌లిసి అట‌కెక్కించారు..!

01-09-201901-09-2019 09:31:38 IST
2019-09-01T04:01:38.324Z01-09-2019 2019-09-01T03:59:38.501Z - - 15-09-2019

అంద‌రూ క‌లిసి అట‌కెక్కించారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అనేది ఇక క‌ల‌నేనా..? పార్టీలు ప్ర‌త్యేక హోదా అంశాన్ని సౌక‌ర్య‌వంతంగా మ‌రిచిపోయారా..?అంద‌రూ క‌లిసి ఈ డిమాండ్‌ను అట‌కెక్కించారా..? అంటే అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏ పార్టీకి ప్ర‌త్యేక హోదా అంశం గురించి మాట్లాడే స‌మ‌యం దొర‌క‌డం లేదు. ప్ర‌తీ అంశాన్ని రాజ‌కీయంగా వాడుకోవాలని చూసే పార్టీలో హోదా జోలికి మాత్రం పోవ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేసే ధైర్యం చేయ‌డం లేదు.

త‌న‌కు 25కు 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా తీసుకువ‌స్తాన‌ని ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తీ స‌భ‌లోనూ ప్ర‌చారం చేశారు. అంతకుముందు ఐదేళ్లు చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌న్ని రోజులూ ఈ అంశాన్ని వైసీపీ ప‌దేప‌దే లేవ‌నెత్తింది.

జ‌గ‌న్ అన్ని జిల్లాల‌కు తిరిగి ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి యువ‌భేరీలు నిర్వ‌హించిన అవ‌గాహ‌న క‌ల్పించారు. ప‌లు పోరాట కార్య‌క్ర‌మాల‌ను సైతం నిర్వ‌హించారు.

చివ‌రి ఏడాది ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడినా హోదా కోసం పోరాడిన క్రెడిట్ మాత్రం జ‌గ‌న్‌కే ద‌క్కింది. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపున‌కు ఇది కూడా ఓ ప్ర‌ధాన కార‌ణం.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగ‌ర్ రాక‌పోతే త‌న ఎంపీల బ‌లం అందించి ప్ర‌త్యేక హోదా తెచ్చుకోవాల‌నేది జ‌గ‌న్ ప్ర‌ణాళిక. అయితే, ఇది రివ‌ర్స్ అయ్యింది. బీజేపీ ఎవ‌రి అవ‌స‌ర‌మూ లేకుండా అధికారంలోకి వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్ ఏకంగా 22 ఎంపీలు గెలిచినా త‌న డిమాండ్ మాత్రం నెర‌వేర్చుకోలేక‌పోయారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి ప్ర‌త్యేక హోదా అడుగుతాన‌ని ఆయ‌న చెప్పారు. అన్న‌ట్లుగానే రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదానే ప్ర‌ధానంగా కోరారు.

అయినా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల ప్ర‌క‌ట‌న రాలేదు. వ‌స్తుంద‌న్న ఆశ కూడా లేదు. ఇటీవ‌ల హోంమంత్రి అమిత్ షాను క‌లిసిన జ‌గ‌న్ ప్ర‌త్యేక‌ హోదా కంటే ఇత‌ర అంశాల‌కే ప్రాధాన్య‌త ఇచ్చారు.

అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఈ విష‌యాన్ని మ‌రిచినా ప్ర‌తిప‌క్షాలు కూడా గుర్తు పెట్టుకోవ‌డం లేదు. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌, రాజ‌ధాని వ్య‌వ‌హారం, ఇసుక కొర‌త‌, అన్నా క్యాంటీన్లు వంటి అన్ని అంశాల‌పైనా ప్ర‌భుత్వంపై పోరాటానికి దిగుతున్న టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌శ్నించ‌డం లేదు.

రాష్ట్రానికి ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని 2014లో అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. అప్పుడే హామీని నెర‌వేర్చి ఉంటే ఇప్ప‌టికే హోదా వ‌చ్చి కూడా ఆరేళ్లు అయ్యేది.

కానీ, ఇప్పుడు ఆల‌స్యం చేసినా కొద్ది ఈ అంశం పాత‌బ‌డిపోతోంది. ఎప్ప‌టికప్పుడు కొత్త అంశాలు తెర‌పైకి వ‌స్తుండ‌టంతో ప్ర‌త్యేక హోదా అంశం పూర్తిగా తెర‌మ‌రుగైంది. వైసీపీని టార్గెట్ చేయ‌డానికి టీడీపీ, జ‌న‌సేన‌కు ఇది మంచి అవ‌కాశం అయినా ఉప‌యోగించుకోవ‌డం లేదని విశ్లేష‌కులు అంటున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle