అందరి సంగతి తర్వాత.. అయినవారేరి..?
15-11-201915-11-2019 08:53:34 IST
Updated On 15-11-2019 16:34:04 ISTUpdated On 15-11-20192019-11-15T03:23:34.102Z15-11-2019 2019-11-15T03:23:11.179Z - 2019-11-15T11:04:04.367Z - 15-11-2019

తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాడుతున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి వైసీపీ సర్కార్‌పై పోరాడాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడుకు స్వంత పార్టీ నేతలే ఊహించని షాక్ ఇచ్చారు. అన్ని పార్టీలనూ కలుపుకోవాలనే చంద్రబాబు ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోగా స్వంత ఎమ్మెల్యేలే బాబు ఇసుక దీక్షకు డుమ్మా కొట్టేశారు.రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు నాయుడు 12 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నించి పాక్షికంగా విజయం సాధించారు. జనసేన పార్టీ ఈ దీక్షకు మద్దతివ్వడంతో పాటు ఆ పార్టీ ప్రతినిధులను దీక్షకు పంపించింది. మిగతా పార్టీల నుంచి మాత్రం స్పందన రాలేదు. అయితే, మిగతా పార్టీలను పక్కన పెడితే స్వంత పార్టీ నేతలే చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. బాబు దీక్షకు సగం మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది దీక్షకు హాజరుకాకపోవడంతో టీడీపీ అధినాయకత్వం కూడా ఆలోచనలో పడింది. పార్టీ అధినేత చేస్తున్న దీక్షకు రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు కానీ కేవలం 23 మంది మాత్రమే ఉన్నప్పుడు ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం బాబు దీక్షను పట్టించుకోలేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లో సగం మంది అసెంబ్లీలో, బయట అంత యాక్టీవ్‌గా టీడీపీ తరపున మాట్లాడటం లేదు. తమ పార్టీపై, అధినేతపై అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా వీరు స్పందించడం లేదు. కేవలం వారు గెలిచిన నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది వైసీపీ, బీజేపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరు చంద్రబాబు దీక్షకు కూడా రాకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అన్ని పార్టీలనూ కలుపుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు స్వంత ఎమ్మెల్యేలు అందరూ దీక్షకు హాజరయ్యేలా చూసుకుంటే ఇటువంటి అనుమానాలన్నీ పటాపంచలయ్యేవి. ఇక, చంద్రబాబు దీక్షను నైతికంగా, రాజకీయంగా దెబ్బతీయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. సరిగ్గా దీక్షకు ఒకరోజు ముందు విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్‌లో సీఐడీ సోదాలు జరిగాయి. ఇంకా సరైన ఆధారాలు లభించకపోయినా ఈ సంస్థ నారా లోకేష్ సన్నిహితులదని, ఇసుక కృత్రిమ కొరతకు ఈ సంస్థనే కారణమని, ఇసుక కొరత వెనుక టీడీపీ కుట్ర ఉందనే ప్రచారం వైసీపీ పెద్ద ఎత్తున చేసింది. రాజకీయంగానే చంద్రబాబు దీక్ష రోజునే పక్కా వ్యూహాన్ని వైసీపీ అమలు చేసింది. దీక్షకు ముందు రోజు తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం, దీక్ష రోజే ఆయన వైసీపీలో చేరడం వైసీపీ వ్యూహమే. దీక్ష కొనసాగుతుండగానే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబుపై, ఇసుక దీక్షపై, టీడీపీపై తీవ్ర విమర్శలు చేయడం కూడా వ్యూహమే.

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
5 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
20 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
35 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా