newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

అందుబాటులోకి గుంటూరు జీజీహెచ్ క్యాన్సర్ సెంటర్

01-07-202001-07-2020 09:39:16 IST
Updated On 01-07-2020 10:13:09 ISTUpdated On 01-07-20202020-07-01T04:09:16.793Z01-07-2020 2020-07-01T04:09:01.648Z - 2020-07-01T04:43:09.226Z - 01-07-2020

 అందుబాటులోకి గుంటూరు జీజీహెచ్ క్యాన్సర్ సెంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల లక్షలాదిమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దేశంలో క్యాన్సర్ చికిత్స అత్యంత ఖరీదుగా మారింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తోంది.

గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నాట్కో అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి విరాళం రూ.33 కోట్లతో నిర్మించిన నాట్కో కేన్సర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉదయం 10గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించనున్నారు. దీంతో కేన్సర్‌ రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యూనిట్‌ నిర్మాణం కోసం ఆసుపత్రిలో ఎకరం స్థలంలో 80 వేల చదరపు అడుగుల పరిధిలో జి+3 నిర్మాణం జరిపారు. మొత్తం 110 పడకల సామర్ధ్యం గల ఈ యూనిట్‌లో కీమోథెరఫీ, రేడియాలజి, ఆపరేషన్‌ థియేటర్లు, ఇన్‌ పేషంట్‌ వార్డులు పూర్తి సౌకర్యాలతో నిర్మించారు. 

మొదట భవన నిర్మాణానికే వెంకయ్యచౌదరి ముందుకు వచ్చారు. అనంతరం మౌలిక సదుపాయాల కల్పన కూడా మరో రూ.15 కోట్లు వెచ్చించారు. ఇప్పటికే రూ.రెండు కోట్లతో లీనియర్‌ యాక్సలేటర్‌ను అమర్చారు  ఇప్పటికే నన్నపనేని వెంకయ్యచౌదరి జీజీహెచ్‌లోని పలు విభాగాల ఆధునికీకరణకు రూ.పది కోట్లకు పైగా వెచ్చించారు.

చిన్నపిల్లల చికిత్స విభాగం, ఆర్ధో విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌ ఆధునికీకరణ, న్యూరాలజీ విభాగానికి స్లీపింగ్‌ థియేటర్‌లను నిర్మించి ఇచ్చారు. కలెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆనంద కుమార్‌, పలువురు ఉన్నతాదికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. థ ఈ క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి వస్తే మరింతమందికి వైద్యం అందించే అవకాశం వుంటుంది. ఏపీలోని క్యాన్సర్ రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle