newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

అందుకే ఆ ముగ్గురికి జ‌గ‌న్ ఆఫ‌ర్‌..!

12-08-201912-08-2019 17:57:46 IST
Updated On 13-08-2019 12:28:50 ISTUpdated On 13-08-20192019-08-12T12:27:46.438Z12-08-2019 2019-08-12T12:27:38.741Z - 2019-08-13T06:58:50.645Z - 13-08-2019

అందుకే ఆ ముగ్గురికి జ‌గ‌న్ ఆఫ‌ర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల‌కు వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. 10 మందికి పైగా నేత‌లు పోటీ ప‌డినా చివ‌రకు మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, మైనారిటీ వ‌ర్గానికి చెందిన మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, క‌ర్నూలు జిల్లాకు చెందిన చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డికి జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రామ్‌, ప‌య్యావుల కేశ‌వ్ టీడీపీ నుంచి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావ‌డంతో మూడు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. మూడు కూడా ఎమ్మెల్యే కోటావి కావ‌డం, వైసీపీకి మూడు గెలుచుకునే బ‌లం ఉండటంతో మోపిదేవి, ఇక్బాల్‌, చ‌ల్లా ఎమ్మెల్సీలు కావ‌డం ఖాయ‌మే. పైగా, తెలుగుదేశం పార్టీ పోటీకి కూడా దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో వీరు ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్నారు.

పోటీ ఎక్కువ‌గానే ఉన్నా వీరు ముగ్గురిని జ‌గ‌న్ ఎంపిక చేయ‌డం వెనుక సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌తో పాటు మాట ఇవ్వ‌డం ప్ర‌ధాన కార‌ణాలు. త‌న కోసం అనేక ఇబ్బందులు ప‌డ్డ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడినా ఆయ‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌. దీంతో ఆరు నెల‌ల్లోగా ఆయ‌న ఎమ్మెల్సీ కావాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు జ‌గ‌న్‌.

మ‌రో స్థానాన్ని హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిన మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌కు జ‌గ‌న్ ఖరారు చేశారు. రంజాన్ సంద‌ర్భంగా జ‌రిగిన ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మంలో ముస్లింల‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కే జ‌గ‌న్ ఆయ‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు. మూడు స్థానాల్లో ఒక‌టి మైనారిటీకి, మ‌రొక‌టి బీసీకి ఇవ్వ‌గా ఇంకొటి రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ నేత‌కు ఇవ్వాలని నిర్ణ‌యించారు.

ఈ మూడో స్థానం కోసం క‌డ‌ప జిల్లాకు చెందిన ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి, క‌ర్నూలుకు చెందిన చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి పోటీ ప‌డ‌గా జ‌గ‌న్ రామ‌కృష్ణారెడ్డికి ఖాయం చేశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం కొన‌సాగిన రామ‌కృష్ణారెడ్డి జిల్లాలో సీనియ‌ర్ నేత‌. నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలో ప్ర‌త్యేకించి బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న నేత‌.

2014 ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి చంద్ర‌బాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. కానీ, ఆయ‌న‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో టీడీపీలో అయిష్టంగా కొన‌సాగిన ఆయ‌న ఇటీవ‌లి ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందే వైసీపీలో చేరి పార్టీ గెలుపు కోసం ప‌నిచేశారు. పార్టీలో చేరిన‌ప్పుడే ఆయ‌నకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇలా, మాటిచ్చిన ముగ్గురికీ ఎమ్మెల్సీ ప‌దవులు ఇచ్చిన జ‌గ‌న్ సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌ను బేరీజు వేసుకున్నారు.

అయితే, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, అమ‌ర్‌నాథ్ రెడ్డి, పండుల ర‌వీంద్ర‌బాబు, డీఎల్ ర‌వీంద్రారెడ్డి వంటి నేత‌లు సైతం జ‌గ‌న్ నుంచి ఎమ్మెల్సీ హామీ పొంది ఉన్నారు. మ‌రి, వ‌చ్చే వారికి ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle