newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

అందరి చూపు మే 19 వైపు

17-04-201917-04-2019 14:46:28 IST
Updated On 18-04-2019 15:17:32 ISTUpdated On 18-04-20192019-04-17T09:16:28.553Z17-04-2019 2019-04-17T09:16:26.421Z - 2019-04-18T09:47:32.939Z - 18-04-2019

అందరి చూపు మే 19 వైపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. దీంతో నేతలకు బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరం ఏపీలో ముగిసినా... ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది ఎవరనేది స్పష్టత లేకపోవడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలిచేందుకు అధికార టీడీపీ, విపక్షపార్టీ వైసీపీ చేసిన ప్రయత్నాలు ఎన్నికల రోజు కూడా స్పష్టంగా కనిపించాయి.

ఏ పార్టీకి ఆ పార్టీ దూకుడు ప్రదర్శించింది. అయితే ఓటరు దేవుళ్ళు మాత్రం తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేశారు. అయితే, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఎవరిని అందలం ఎక్కించనున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు మాత్రం దాదాపు ఇంకా 36 రోజుల నిరీక్షణ తప్పదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

పోనీ మీడియా ఇచ్చే ఎగ్జిట్ పోల్స్  వెల్లడికి ముకుతాడు వేసింది ఈసీ. ఎన్నికలు ముగియగానే వచ్చే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించకూడదంటూ ఆంక్షలు విధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్న మే19 వరకూ యథాతథ పరిస్థితి నెలకొని వుంది. ఏ ఛానెల్, ఏ వార్త సంస్థ విశ్లేషణ అయినా కూడా మే 19 సాయంత్రం 6 తర్వాతే విడుదల కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో అధికారం ఎవరిది..? అనే ఆసక్తికర విషయం కోసం దాదాపు నెలకు పైగా వెయిట్‌ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

పార్టీలు మాత్రం చాలా ఉత్సాహంగా, చాలా జోష్‌గా కనిపిస్తుండడం గమనించాల్సిన అంశం. ఎన్నికలకు పోటెత్తిన మహిళలు, వృద్ధులు, యువతను అంచనా వేసుకుంటున్న ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు గెలుపు తమదంటే తమదేనని చెబుతున్నారు. అంతేకాదు, మహిళా ఓట్లు మాకేనని టీడీపీ అంటే.. లేదు ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత మహిళల రూపంలో వ్యక్తం కానుందని వైసీపీ అంటోంది. దీంతో రెండు శిబిరాల్లో ఎన్నడూ లేని విధంగా ఆనందం తాండవిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle