newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అందరికీ దుర్గమ్మ దర్శనం.. వివాదాలకు దూరం

09-09-201909-09-2019 17:17:41 IST
2019-09-09T11:47:41.864Z09-09-2019 2019-09-09T11:41:02.840Z - - 16-11-2019

అందరికీ దుర్గమ్మ దర్శనం.. వివాదాలకు దూరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దసరా రాష్ట్ర పండుగ కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దసరా సందర్భంగా ప్రసిద్ధిచెందిన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో పరిశీలన జరిపారు. ఈ సమావేశంలో ఎండోమెంట్, ఇంద్రకీలాద్రి, పోలీస్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. పవిత్రమయిన దేవాలయంలో రాజకీయాలకు, అవకతవకలకు చోటివ్వకూడదన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయ ప్రతిష్ట వివిధ వివాదాల వల్ల మంటగలిసిందన్నారు. 

గత అనుభవాల నేపథ్యంలో అన్నీ పకడ్బందీగా అమలు కావాలని ఆయన ఆదేశించారు.  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తుల సౌకర్యమే ప్రధానమన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. దసరా ఏర్పాట్లను ఈనెల 25 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించామన్నారు.  దసరా ఉత్సవాలకు ఫ్లై ఓవర్ పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించామన్నారు.

గత ఏడాది ఆగస్టులో ఒక భక్తురాలు అమ్మవారికి చీర సమర్పించగా, ఆ చీర మాయం కావడం పెద్ద దుమారమే రేపింది. రూ.18 వేల విలువైన చీరను అప్పటి పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత తీసుకువెళ్ళినట్టు విచారణలో తేలింది.

దీంతో ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వివాదంపై విమర్శలు చేసింది విపక్ష వైసీపీ. ప్రస్తుతం అధికారంలోకి వున్న వైసీపీ ఎలాంటి అవకతవకలకు, వివాదాలకు తావులేకుండా ఈసారి దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధం అయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle