ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

అంత అసహనం ఎందుకొచ్చినట్టు?

05-01-201905-01-2019 12:07:56 IST
Updated On 05-01-2019 18:25:57 ISTUpdated On 05-01-20192019-01-05T06:37:56.357Z05-01-2019 2019-01-05T06:37:54.652Z - 2019-01-05T12:55:57.994Z - 05-01-2019

అంత అసహనం ఎందుకొచ్చినట్టు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సంయమనంతో వ్యవహరించాలి. కానీ, ఆవేశానికి లోనైతే రాజకీయాల్లో ఎలాంటి సమాచారం బయటకు వెళుతుంది? పార్టీ అధినేతల ఆవేశాలు కార్యకర్తలకు నెగిటివ్ సంకేతాలు పంపకుండా ఉంటాయా? ఏపీ సీఎం చంద్రబాబునాయుుడు ఇంతకుముందు చాలా శాంతంగా ఉండేవారు. ఎవరు రెచ్చగొట్టినా సహనంతో  వ్యవహరించేవారు. కానీ రానురాను ఆయనలోనూ ఆ సహనం పాళ్ళు తగ్గుతున్నాయని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కాకినాడలో జన్మభూమి సభలో బీజేపీ మహిళా నేతను చంద్రబాబు హెచ్చరించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘బయటికొస్తే వదలిపెట్టరు పబ్లిక్.. జాగ్రత్తగా ఉండు.’ అంటూ సీఎం స్థాయి వ్యక్తి బెదిరించడం...ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై ఒక రేంజిలో విరుచుకుపడడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. మరో వైపు చంద్రబాబు తీరుని తప్పుబట్టారు బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. తెలంగాణలో ప్రజా కూటమి ఓటమి తర్వాత ఏపీ సీఎం చంద్రబాబులో అసహనం పెరిగిందని జీవీఎల్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ ఉన్నాయన్న చంద్రబాబు ..తాను చాలా శాంతంగా ఉంటున్నానని రెండురోజుల క్రితమే వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడీ స్థాయిలో కోపం ప్రదర్శించడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ మహిళా నేతను రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారని వస్తున్న వార్తలు ఏపీ బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడిచేశారని, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ నేతలను బెదిరించడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ సైతం చంద్రబాబు సైగ చేస్తే బీజేపీ వాళ్లు రోడ్లపై కూడా తిరగలేరని వార్నింగ్ ఇవ్వడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసినప్పుడు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను, సీపీఎం అగ్రనాయకులపై లాఠీఛార్జి చేయడాన్ని కొంతమంది గుర్తుచేస్తున్నారు. 

Image may contain: 2 people, text

మరోవైపు ఇలాంటి మాటల ద్వారా బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే కొట్టమని సంకేతాలు ఇస్తున్నట్టేకదా అని బీజేపీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ అవినీతిపై నిరసన తెలపడం, విమర్శించడం తప్పెలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబులో రానురాను సహనం తగ్గుతుందనడానికి గతంలో నాయీ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల్ని కొందరు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. విజయవాడలో కనీస వేతనాలు, ఇతర సౌకర్యాల కోసం నాయీ బ్రాహ్మణులు నిరసనకు దిగారు. అటుగా వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో ఆవేశానికి లోనైన చంద్రబాబు ‘ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నారా ..జీతాలు పెంచేది లేదు ..ఏ ఊరు నుండి వచ్చారు ..ముందు విధుల్లో చేరండి ..మీకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా చేస్తే చేయండి ..లేకపోతే లేదు ..నచ్చితే చేయండి ..లేకుంటే వెళ్ళిపొండి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈమధ్య అగ్రిగోల్డ్ బాధితుని పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరుని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు తీరులో వస్తున్న మార్పులు టీడీపీకి నెగిటివ్ అవుతాయంటున్నారు. 

Image result for చంద్రబాబు ఆగ్రహం నాయీ బ్రాహ్మణులు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle