newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అంతా డిజిటల్.. బిజినెస్ డల్

21-03-201921-03-2019 11:57:41 IST
2019-03-21T06:27:41.098Z21-03-2019 2019-03-21T06:14:17.645Z - - 17-07-2019

అంతా డిజిటల్.. బిజినెస్ డల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు కేవలం ఫేస్ బుక్ఎన్నికలు అంటేనే గుర్తుకొచ్చేది జెండాలు, టోపీలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు. ప్రతి ఎన్నికల సమయంలో ఏ గల్లీలో చూసినా ఇవే కనిపిస్తాయి. , వాట్సాప్, టెలిగ్రాం, ట్విట్టర్లనే ఫాలో అవుతున్నారట. దీంతో ఫ్లెక్సీలు, బ్యానర్లకు ఆర్డర్లు రావడం లేదట. 

ఎందుకంటే గత ఎన్నికల్లో విశాఖపట్నంకు చెందిన ఓ డిజిటల్స్ యాజమాన్యం దాదాపు 10 లక్షలు రూపాయల ఆదాయం పొందింది. ఉత్తరాంధ్రలోని అభ్యర్ధులకు బ్యానర్లు, ఫ్లెక్సీలు తయారు చేసి లాభం పొందింది. కానీ ఈసారి ఏ ఒక్క డిజిటల్ కంపెనీకి ఆర్డర్లు రావడం లేదట. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్దులు ఎవ్వరూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేందుకు ఇష్టపడటం లేదట. 

సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే డబ్బులు ఆదా అవుతాయని అభ్యర్ధులు చెబుతున్నారట. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ఫెక్సీలు, బ్యానర్లకు అయ్యే ఖర్చులో 80 శాతం ఆదా అవుతోందని అభ్యర్ధులు చెబుతున్నారట. దీంతో వ్యాపారం లేక ఫెక్సీలు, బ్యానర్ల తయారీదారులు బాగా ఇబ్బందిపడుతున్నారు. 

ముఖ్యంగా టీడీపీ నేతలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని తమ ప్రచారం చేస్తుంటే, జనసేన టెలిగ్రాం యాప్ ద్వారా ఒకేసారి 10 వేల మందిని రీచ్ అయ్యేలా ప్లాన్ చేసిందట. దీంతో తమకు ఆర్డర్లు రావడం లేదని డిజిటల్ దుకాణ వ్యాపారులు వాపోతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా ఈ ఎన్నికల్లో వారి ఆదాయాన్ని గండికొట్టింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle