newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అంతా జ‌గ‌నే చేశారు..! ఖాళీగా కూర్చున్న వైసీపీ నాయ‌కులు..!

28-07-202028-07-2020 07:57:35 IST
Updated On 28-07-2020 08:17:22 ISTUpdated On 28-07-20202020-07-28T02:27:35.046Z28-07-2020 2020-07-28T02:19:47.778Z - 2020-07-28T02:47:22.979Z - 28-07-2020

అంతా జ‌గ‌నే చేశారు..! ఖాళీగా కూర్చున్న వైసీపీ నాయ‌కులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్లో బ‌య‌ట‌కు చెప్పుకోలేని అసంతృప్తి క‌నిపిస్తోంది. వారి నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల వైసీపీ నేత‌లు ఇప్పుడు ఖాళీగా కూర్చున్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే త‌మ హ‌వా ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు ఎవ‌రి స్థాయిలో వారు భావించారు. కానీ, వాస్త‌వంగా ప‌రిస్థితులు వారి అంచ‌నాల‌కు భిన్నంగా ఉన్నాయి.

తొమ్మిదేళ్ల పాటు క‌ష్ట‌ప‌డినందుకు అధికారంలోకి వ‌చ్చాక చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని అనుకున్న వారి క‌ల‌లు నెర‌వేర‌డం లేదు. అయితే, స్వంత పార్టీపై అసంతృప్తిని బ‌య‌ట‌కు చెప్పులేక ఇప్పుడు వారు లోలోన ఇబ్బంది ప‌డుతున్నారు.

మ‌న ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌లో ఖ‌ద్దరు బ‌ట్ట‌ల విలువ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఓ రేష‌న్ కార్డు కావాల‌న్నా, పింఛ‌న్ కావాల‌న్నా, ఇంకా ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కం కావాల‌న్నా ప్ర‌జ‌లు అధికార వ్య‌వ‌స్థ కంటే ఎక్కువ రాజ‌కీయ నాయ‌కుల‌పైనే ఆధార‌ప‌డ‌తారు. ఓ గ్రామంలో ఓ కుటుంబానికి రేష‌న్ కార్డు కావాలంటే ఆ గ్రామంలో అధికార పార్టీ నాయ‌కుడిని ప్ర‌స‌న్నం చేసుకోవాలి. నాలుగైదు సార్లు ఉద‌యాన్నే ఆయ‌న ఇంటికి వెళ్లి న‌మ‌స్కారం పెట్టి ప‌ని చేసి పెట్టండ‌య్యా అని విన‌తులు ఇవ్వాలి. చివ‌ర‌కు ఆ నాయ‌కులు అధికారుల‌తో మాట్లాడి రేష‌న్ కార్డు ఇప్పిస్తాడు. అనేక ఏళ్లుగా జ‌రిగే తంతు ఇది.

ఇక్క‌డ ఇంకొన్ని క‌థ‌లు కూడా ఉంటాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కం కావాల‌ని వ‌చ్చిన వ్య‌క్తి ఏ పార్టీ వాడ‌ని స‌ద‌రు నాయకుడు చూసుకుంటాడు. త‌మ పార్టీకే ఓటు వేస్తాడా అనేది ముఖ్యం అవుతుంది. గ్రామీణ స్థాయిలోనూ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చూసుకుని ప‌ని చేసి పెడ‌తారు.

అవ‌త‌లి పార్టీకి సానుకూలుడు అని తెలిస్తే ఇక ప‌ని జ‌ర‌గ‌డం క‌ల‌నే. గ‌తంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలానే జ‌రిగింది. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో టీడీపీ నాయ‌కులే వారికి నచ్చిన‌ట్లుగా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసేవారు. ఈ క్ర‌మంలో గ్రామ స్థాయిలో వైసీపీ వారికి ప‌థ‌కాలు అంద‌లేదు. వైసీపీ నాయకుల ప‌నులు కాలేదు.

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక మా హ‌వా న‌డుస్తుందిలే అని వైసీపీ నేత‌లు ఆశ‌ప‌డ్డారు. పార్టీ గెలుపు కోసం వారి స్థాయిలో క‌ష్ట‌పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన సంతోషం కొంత‌కాలానికే ఆవిరైంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు గ్రామ స‌చివాల‌యాలు, గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ డ్రీమ్ ప్రాజెక్టులు. ఈ వ్య‌వ‌స్థ‌ల ద్వారా పాల‌న‌లో స‌మూల మార్పులు తీసుకురావాల‌ని, ప్ర‌జ‌ల ముంగిట పాల‌న‌ను ఉంచాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. ఈ ఆలోచ‌న‌ల‌ను వేగంగానే అమ‌లు చేశారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.

ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వాలంటీర్‌ను పెట్టారు. ఆ 50 ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వానికి - ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వాలంటీర్ వార‌ధిగా ఉంటాడు. ఏ ప‌థ‌క‌మైనా వారికి అందించేది వాలంటీరే. ఒక‌టో తేదీన పింఛ‌న్ పంచ‌డం మొద‌లు అన్నీ వాలంటీర్ చేతుల‌మీదుగానే జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా వాలంటీర్‌నే ప్ర‌భుత్వంగా భావిస్తున్నారు. వారికి ఏ స‌మ‌స్య ఉన్నా, ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కం కావాలన్నా వాలంటీర్‌నే అడుగుతున్నారు.

నిజానికి, వాలంటీర్ల‌కు ప్ర‌భుత్వం గౌర‌వ వేత‌నం ఇస్తున్నందున ప్ర‌జ‌లు వారిని గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కుముందులా నాయ‌కులు, అధికారుల‌కు న‌మ‌స్కారాలు పెట్టి బ‌తిమాలే ప‌రిస్థితులు కూడా త‌గ్గిపోయాయి.

అందుకే జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల మిగ‌తా విష‌యాల్లో అంద‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నా వాలంటీర్ల విష‌యంలో మాత్రం ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉంది. అయ‌తే, వైసీపీ నేత‌ల‌కు మాత్రం ఇది ఇబ్బందిగా మారింది. ప్ర‌జ‌లు ఎవ‌రూ వారి వ‌ద్ద‌కు వెళ్లి ప‌నుల కోసం అడ‌గ‌టం లేదు. ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడాల్సిన నేత‌ల ఇళ్లు బోసిపోతున్నాయి. అంద‌రూ వాలంట‌ర్‌నే అడిగి ప‌ని చేయించుకుంటున్నారు. ప‌థ‌కాల అమ‌లులో గ‌తంలో నాయ‌కులు ఇప్పుడు మ‌ధ్య‌వ‌ర్తులుగా లేరు.

మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే స‌ర్పంచ్‌లుగానో, ఎంపీటీసీలుగానో కొంత గ్రామంలో చ‌క్రం తిప్పే ప‌రిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎన్నిక‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. దీంతో వైసీపీ నేత‌లంతా ఖాళీగా కూర్చున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యిందే అని లోలోన బాధ‌ప‌డుతున్నారు.

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   17 minutes ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   28 minutes ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   an hour ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   2 hours ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   15 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   15 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   18 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   20 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle