newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

అంతా చిన‌బాబే చేశారు..!

13-07-201913-07-2019 08:21:10 IST
2019-07-13T02:51:10.998Z13-07-2019 2019-07-13T02:51:00.369Z - - 26-08-2019

అంతా చిన‌బాబే చేశారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చిన‌బాబు నారా లోకేశ్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఓ వైపు ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మితో ఢీలాప‌డిన తెలుగుదేశం పార్టీని నేత‌ల వ‌ల‌స‌లు మ‌రింత దెబ్బ‌తీస్తున్నాయి. అయితే, పార్టీ నుంచి వెళ్లే నేత‌లు తిన్న‌గా పోకుండా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పై నాలుగు రాళ్లేసి పోతున్నారు. పార్టీలో అసంతృప్తితో ఉన్న వారు సైతం లోకేశ్‌నే టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన కాపు సామాజ‌క‌వ‌ర్గం నేత‌లంతా రెండుసార్లు వ‌రుసగా స‌మావేశ‌మ‌య్యారు. ర‌హ‌స్యంగా సాగిన ఈ స‌మావేశంలో కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌లు పాల్గొని ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఓటమికి కార‌ణాల‌ను విశ్లేషించుకున్నారు. అయితే, ఈ స‌మావేశంలోనూ చాలామంది నేత‌లు లోకేశ్‌నే టార్గెట్ చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా, పార్టీ ఫండ్ విష‌యంలో కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థుల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు కూడా లోకేశ్ త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నేది వారి ఆరోప‌ణ‌. గ‌త ఐదేళ్ల తెలుగుదేశం ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కేవ‌లం ఒక సామాజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చి త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని వారంతా బాధ‌ప‌డ్డార‌ని స‌మాచారం.

ఇక‌, తాజాగా పార్టీని వీడే నేత‌లు సైతం లోకేశ్‌నే టార్గెట్ చేసినట్లు క‌నిపిస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత‌, ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మొత్తం లోకేశ్ టార్గెట్‌గానే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఓడిన త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉండే హ‌క్కు లేద‌ని చెబుతూ ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్య‌లు లోకేశ్‌కే త‌గులుతున్నాయ‌ని, ఆయ‌న‌ను ఇరుకున‌పెట్టేలా ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌, టీడీపీలో లోకేశ్ రాక‌కు ముందు చంద్ర‌బాబు నాయుడుకు స‌న్నిహితంగా ఉంటూ పార్టీలో కీ రోల్ ప్లే చేసిన నేతలు సైతం లోకేశ్ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నార‌ట‌. లోకేశ్ యాక్టీవ్ అయ్యాక త‌మ‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌నేది వారి బాధ‌. ఇటీవ‌ల పార్టీని వీడి బీజేపీలో చేరిన టీడీపీ ముఖ్య నేత‌ల్లోనూ ఒక‌రిద్ద‌రిలో ఇదే బాధ ఉండేద‌ట‌.

ఇక‌, ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసే ప‌లువురు నాయ‌కులతో ఎమ్మెల్సీ ప‌ద‌వులకు రాజీనామా చేయించారు. నారా లోకేశ్ మాత్రం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయ‌న ఓడిపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో ఓడిన వారంతా ఇప్పుడు లోకేశ్‌ను చూసి ఈర్శ్య ప‌డుతున్నారని స‌మాచారం.

ఇప్ప‌టికే చిన‌బాబు లోకేశ్‌పై పార్టీలో అసంతృప్తి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా తాజాగా ఆయ‌న‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లేదా శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే, అసంతృప్తులు కొంద‌రు ఉన్నా లోకేశ్‌కు అనుకూలంగా కూడా టీడీపీలో పెద్ద టీమ్ ఉంది. వీరంతా లోకేశ్ పార్టీలో మ‌రింత కీ రోల్ పోషించాల‌ని కోరుతున్నార‌ట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle