newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అంతా ఆ ఇద్దరే చూసుకుంటున్నారా..?

24-08-201924-08-2019 15:48:25 IST
Updated On 24-08-2019 15:48:21 ISTUpdated On 24-08-20192019-08-24T10:18:25.693Z24-08-2019 2019-08-24T10:15:48.213Z - 2019-08-24T10:18:21.821Z - 24-08-2019

అంతా ఆ ఇద్దరే చూసుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఏం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా కాషాయ జెండా మోస్తూ, ఆర్ఎస్ఎస్‌లో ప‌నిచేస్తూ పార్టీకి క‌ష్టకాలంలోనూ అండ‌గా ఉన్న నేత‌ల కంటే ఇటీవ‌ల ఆ పార్టీలో చేరిన నేత‌ల‌దే జోష్ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ హ‌వా ఇప్పుడు ఏపీ బీజేపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

పాత నేత‌ల కంటే వీరి పేర్లే త‌ర‌చూ వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అత్యంత స‌న్నిహితులు, న‌మ్మ‌క‌స్తులైన వీరిద్ద‌రూ బీజేపీలో చేర‌డ‌మే అనూహ్య ప‌రిణామం. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ న‌రేంద్ర మోడీ, బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో సీఎం ర‌మేష్ ముందున్నారు.

సుజ‌నా చౌద‌రి మాత్రం కొంత ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి నెల తిర‌క్కుండానే బీజేపీలో చేరిన ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ఏపీ బీజేపీలో కీల‌క నేత‌లుగా మారిపోయారు.క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, కంభంపాటి హ‌రిబాబు అనేక‌మంది నేత‌లు ఉన్నా వీరిద్ద‌రి పేర్లే త‌ర‌చూ వినిపిస్తున్నాయి.

అయితే, టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పీక‌ల దాకా కోపం పెంచుకున్న వీరు ఇప్పుడు బీజేపీలో చేర‌డంతో మ‌రింత స్పీడ్ పెంచారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంలో బాగా ముందుంటున్నారు. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించ‌డంలో కీల‌క పాత్ర వీరిదే.

టీడీపీ హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు, పీపీఏలు, రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో కుంభ‌కోణాలు జ‌రిగాయ‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. దీంతో వీట‌న్నింటినీ తిర‌గదోడాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

అయితే, ఈ నిర్ణ‌యాల‌ను టీడీపీతో స‌మానంగా బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. ముఖ్యంగా సుజ‌నా చౌద‌రి బాధ్య‌తంతా తీసుకొని మ‌రీ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండురోజుల క్రితం మోడీ, అమిత్ షా అనుమ‌తిలోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌గానే గంట‌ల్లోనే సుజ‌నా చౌద‌రి మీడియా ముందుకు వ‌చ్చారు.

తాను కేంద్ర మంత్రులతో మాట్లాడాన‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని చెప్పారు. అంత‌టితో ఊరుకోకుండా తెల్లారే కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్‌ను క‌లిశారు. ఆయ‌న సాయంత్రం నాటికి పోల‌వ‌రం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక హెచ్చ‌రిక జారీ చేశారు.

ముఖ్యంగా గ‌త టీడీపీ ప్రభుత్వ నిర్ణ‌యాల‌పై వైసీపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే ఈ ఇద్దరు ఎంపీలు విమ‌ర్శించ‌డంలో ముందుంటున్నారు. విమ‌ర్శించ‌డ‌మే కాకుండా ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణయాలు వివాదాస్ప‌ద‌మైన‌వ‌ని కేంద్రం దృష్టికి వెంట‌నే తీసుకుపోతున్నారు.

ఈ స‌మ‌యంలో వీరు త‌మ మాజీ నేత చంద్ర‌బాబు నాయుడుపై సాఫ్ట్ కార్న‌ర్‌తో క‌నిపిస్తున్నార‌ని వైసీపీ భావిస్తోంది. తాము ముందునుంచీ అనుమానించిన‌ట్లుగా చంద్ర‌బాబును కాపాడటానికే వీరిద్ద‌రూ బీజేపీలో చేరార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అయితే వీరిద్దరూ ఈ విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదు. 

ఎన్నిక‌ల ముందు రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పోల‌వ‌రం ప్రాజెక్టు చంద్ర‌బాబు నాయుడుకు ఒక ఏటీఎంలా త‌యారైంద‌ని విమ‌ర్శించిన విష‌యాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. ఏదేమైనా సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ బీజేపీలో కీల‌కంగా ఉండ‌టం మాత్రం చంద్ర‌బాబు నాయుడుకు భ‌విష్య‌త్‌లోనైనా కొంత మేలు చేసే అంశంలానే క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle