newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

అంతర్వేది... బీజేపీకి రాజకీయ లబ్ధి

14-09-202014-09-2020 18:12:20 IST
2020-09-14T12:42:20.247Z14-09-2020 2020-09-14T12:42:16.304Z - - 29-09-2020

అంతర్వేది... బీజేపీకి రాజకీయ లబ్ధి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన రాష్ట్రంలో  ఆగ్రహ జ్వాలలకు కారణమైనే...అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసినా అంతిమంగా రాజకీయ లబ్ధి మాత్రం భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ...రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ...ఇలా విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామంటూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా నెరవేర్చకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరించిన ఫలితంగా ఏపీలో బీజేపీకి రాజకీయ ఉనికి దాదాపు మృగ్యమైన పరిస్థితి నుంచి అంతర్వేది ఘటన ఆ పార్టీని బయటపడేసిందనే చెప్పాలి.

అంతర్వేది ఘటనపై బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో రాజకీయంగా ఆ పార్టీకి ఒకింత మైలేజి వచ్చిందన్నది విశ్లేషకుల అభిప్రాయం రాజకీయంగా బలపడటానికి బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.  మతపరంగా సున్నితమైన అంశాల విషయంలో బీజేపీ తొలి నుంచీ కూడా దేశంలో మెజారిటీల హక్కుల రక్షణ విషయంలో  తానే చాంపియన్  అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నది. అది ఆ పార్టీకి కోరుకున్న ప్రయోజనం చేకూర్చే ఎవర్ గ్రీన్ ఎత్తుగడగా మారిపోయింది.

ప్రజలలో భావోద్వేగాలను నింపే ఘటనల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరే ఆ పార్టీ ఓటు బ్యాంకును పెంచుతూ వస్తున్నది. అంతర్వేది ఘటనలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు...ఆ పార్టీ పట్టు పెంచుకునే దిశగా పనికి వచ్చిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ  అంతర్వేదిలో స్వామివారి రథం కాలిపోయిన దుర్ఘటనను ఆసరాగా చేసుకుని ఈ ఘటనలో గాయపడ్డ హిందువుల మనోభావాలలు ఆసరాగా...తనకు ప్రజా మద్దతును కూడగట్టుకోవాలన్నదే...బీజేపీ తీరుగా కనిపిస్తున్నదన్న విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు.

ఎందుకంటే ఇప్పటి ఏపీలో బీజేపీకి నిర్దుష్టమైన ఓటు బ్యాంకు లేదు. పైగా ఏపీలో మతం కంటే కులానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. కులం కార్డుతో ప్రాంతీయ పార్టీలూ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇంత కాలం నెట్టుకువస్తున్నాయి. కానీ విభజన తరువాత కులాల వారీ విభజన రేఖ స్పష్టంగా ఉండటంతో రాష్ట్రంలో జాతీయ పార్టీల ఉనికి నామమాత్రంగా మారిపోయింది. అందుకే అంతర్వేది ఘటనను బీజేపీ అంది వచ్చిన అవకాశంగా భావించి పావులు కదిపిందన్నది విశ్లేషకుల భావన. 

రాష్ట్రంలో కొద్ది శాతంగా ఉన్న ముస్లిం, క్రైస్తవ జనాభా మద్దతు అధాకార వైకాపాకు ఉందన్న అంచనాతో...రాష్ట్రంలో బలంగా ఉన్న మరో రాజకీయ పార్టీ తెలుగుదేశాన్ని దెబ్బతీయాలంటే... ఈ పార్టీకి దన్నుగా ఉన్న వర్గాలలో భావోద్వేగాలు పెచ్చరిల్లాలన్నది బీజేపీ సిద్ధాంత కర్తల అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే అంతర్వేది ఘటనను బీజేపీ రాజకీయ ప్రయోజనం కోణంలోనే చూస్తున్నదన్నది వారి విశ్లేషణ. 

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   an hour ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   2 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   2 hours ago


హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

   2 hours ago


ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

   3 hours ago


పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

   5 hours ago


కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

   5 hours ago


తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

   5 hours ago


ప్రాంతీయ పార్టీలు వైదొలగితే...ఎన్డీయే భవిష్యత్ ఏమిటి?

ప్రాంతీయ పార్టీలు వైదొలగితే...ఎన్డీయే భవిష్యత్ ఏమిటి?

   6 hours ago


బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle