newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

NEET ప్రత్యేక రైలుకు ఆదాయం రూ. 1040.. కంగుతిన్న అధికారులు

15-09-202015-09-2020 13:04:25 IST
2020-09-15T07:34:25.721Z15-09-2020 2020-09-15T07:34:23.344Z - - 29-09-2020

NEET ప్రత్యేక రైలుకు ఆదాయం రూ. 1040.. కంగుతిన్న అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నీట్‌ పరీక్ష కోసం వేసిన ప్రత్యేక రైలును చూసి డెహ్రాడూన్‌ అధికారులు ఖంగుతిన్నారు. ఆదివారం నీట్‌ పరీక్ష జరగగా కోవిడ్‌ పరిస్థితుల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా కేంద్రం వారి కోసం ప్రత్యేకరైళ్లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులకు పరీక్షలు చేయడానికి వచ్చిన రైల్వే సిబ్బందికి మొండి చెయ్యే ఎదురయ్యింది. డెహ్రాడూన్‌లో మొత్తం 18 పరీక్ష సెంటర్‌లు, రూర్కీలో 12 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చాలా తక్కువ మంది ఆ రైలులో ప్రయాణించారు. కేవలం 21 మంది మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రయాణించారు. 

దీని గురించి డెహ్రాడూన్‌ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సీతారామ్ సోంకర్ మాట్లాడుతూ, ప్రత్యేక రైలును ఎక్కువ మంది విద్యార్థులు వినియోగించుకోలేదని కోవిడ్‌ కారణంగా జాగ్రత్తగా ఉండటం కోసం వారు తమ సొంత వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోందని చెప్పారు. పరీక్షల కోసం ప్రత్యేక రైలును నడుపుతున్న రైల్వే శాఖ వీటి కోసం చాలా డబ్బును వెచ్చించింది. అయితే కేవలం రూ. 1040 మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రభుత్వానికి లభించాయి.  

డెహ్రాడూన్‌లో 18 నీట్ పరీక్షా కేంద్రాలు, సమీపంలోని రూర్కేలో 12 కేంద్రాలు ఉంటున్నందున విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తారని భావించిన రైల్వే అధికారులు ఆట్టహాసంతో ప్రత్యేకరైలును నడిపారు. కానీ ఎవరూ ప్రత్యేక రైలు ఎక్కకపోవడం చూసి అధికారులు షాకయ్యారు. సాధారణంగా ఇతర పరీక్షలకు కూడా ఈ కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్థులు ప్రయాణిస్తుంటారు కానీ నీట్ పరీక్షల కోసం దాదాపు అందరూ సొంత వాహనాలనే ఎంచుకున్నారు.

అలాగే మొరాదాబాద్, ప్రయాగ, ఆగ్రా డివిజన్లలో నడిచిన ప్రత్యేక రైళ్ల గతి కూడా ఇలాగే అయింది. ఉదాహరణకు బరేలీ నుంచి ఘజియాబాద్ ప్రత్యేక రైలులో ఒకే ఒక్క విద్యార్థి ప్రయాణించగా, బరేలీ నుంచి లక్నో రైలులో అయిదుగురు విద్యార్థులే ప్రయాణించారు. మొత్తం మీద డెహ్రాడూన్, రూర్కే, లక్నో, మొరాదాబాద్ రైళ్లను కలిపి 21 ప్రయాణీకులు మాత్రమే ప్రయాణించడంతో అధికారులు బిత్తరపోయారు. ఈ మార్గాల్లో ఆదివారం రైళ్ళు నడిపేందుకు అధికారులు  లక్షల రూపాయలు ఖర్చు చేయగా వచ్చిన ఆదాయం కేవలం రూ. 1040లు మాత్రమే కావడం విశేషం.

రైల్వేల చరిత్రలో ఇంత తక్కువ ఆదాయం రావడం ఇదే మొదటి సారి కావడంతో భారతీయ రైల్వే అధకారులు తలపట్టుకు కూర్చున్నారు. కోచ్ లకు కోచ్‌లో ఖాళీగా రావడంతో నష్టం మాట అటుంచితే తమ అంచనా ఎక్కడ తప్పిందని రైల్వే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

700 కిలోమీటర్లు రైలులో ప్రయాణించి వచ్చిన విద్యార్థికి ఆశాభంగం

కాగా  నీట్ పరీక్షకు హాజరవ్వాలని బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ అనే విద్యార్థి ఏకంగా 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. తన స్వస్థలమైన ధర్భంగా నుంచీ ఏకంగా 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. కానీ చివర్లో అతడి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. అసలు గమ్యానికి పది నిమిషాల దూరంలోనే ఆగిపోయింది. పరీక్ష కేంద్రానికి రావడంలో అతడికి 10 నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులను అతడిని హాల్‌లోకి అనుమతించలేదు. ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. దీంతో అతడి విద్యార్థి జీవితంలో ఏడాది కాలం వృథా అయిపోయింది.

‘నేను వారిని వేడుకున్నా. కానీ ఆలస్యమైందని వారు చెప్పారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభవుతుంది. నేను 1.40కి అక్కడి చేరుకున్నాను. కానీ 1.30 తరువాత ఎవరినీ అనుమతించమని అధికారులు ఇది వరకే తేల్చిచెప్పారు. దీంతా నాకు ఓ ఏడాది వృథా అయిపోయింది’ అని స్థానిక మీడియా ప్రతినిధులతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణంలో తాను ఎదుర్కొన్న సమస్యలను వారికి వివరించాడు. 

‘ధర్బంగా నుంచి ముజఫ్ఫర్‌పూర్ చేరుకునేందుకు నేను శనివారం ఉదయం 8 గంటలకు బస్సెక్కాను. ముజఫ్ఫర్‌నగర్‌కు చేరుకుని అక్కడ పాట్నా వెళ్లే బస్సెక్కాను. కానీ దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఏకంగా 6 గంటల పాటు ఆలస్యం జరిగింది. అనంతరం పాట్నాలో రాత్రి 9 గంటలకు మరో బస్సేక్కాను. మధ్యాహ్నం 1.06 గంటలకు కోల్‌కతా చేరుకున్నాను. ఆ తరువాత  ట్యాక్సీలో పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి 1.40 అయింది’ అని అతడు  వాపోయాడు.

 

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   12 hours ago


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   12 hours ago


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   14 hours ago


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

   24-09-2020


వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

   24-09-2020


మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

   23-09-2020


కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

   22-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle