newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

30 మందిని కాపాడి... ప్రాణాలు విడిచింది

15-04-201915-04-2019 12:46:35 IST
2019-04-15T07:16:35.672Z15-04-2019 2019-04-15T07:16:33.946Z - - 22-07-2019

30 మందిని కాపాడి... ప్రాణాలు విడిచింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శునకం అంటే విశ్వాసానికి ప్రతీక. తన యజమాని కోసం ప్రాణాలైనా ఇస్తుంది. శత్రువుల పాలిట సింహస్వప్నం అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా అనే ప్రాంతంలో ఓ శునకం తన విశ్వాసాన్ని చాటుకుంది. ఒకరిని కాదు 30మందికి ప్రాణదానం చేసి తన ప్రాణాలను త్యాగం చేసింది. బాందాలోని భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన శునకం గట్టిగా అరిచింది. అందరినీ అప్రమత్తం చేసింది.  అరుపులు విన్న అక్కడి జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి చూశారు. 

భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం గమనించారు. దీంతో దాదాపు 30 మంది వరకు బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంత మంది ప్రాణాలు కాపాడిన ఆ శునకం మాత్రం సిలిండర్ పేలుతో తన ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు తేల్చారు. ఆ శునకం త్యాగానికి అంతా సలాం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ శునకం త్యాగానికి అంతా నివాళులర్పిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle