newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్‌ని ముంచెత్తిన వాన.. చెరువుల్లా మారిన రోడ్లు

30-06-202030-06-2020 11:39:55 IST
Updated On 30-06-2020 11:58:17 ISTUpdated On 30-06-20202020-06-30T06:09:55.246Z30-06-2020 2020-06-30T06:01:23.844Z - 2020-06-30T06:28:17.452Z - 30-06-2020

హైదరాబాద్‌ని ముంచెత్తిన వాన.. చెరువుల్లా మారిన రోడ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీవర్షం పడడంతో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టుప్రాంతాల్లోని వర్షపునీరు చేరడంతో చెరువులను తలపించాయి. 

మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించివున్న ఉపరితల ద్రోణి కారణంగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో రాత్రంతా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల . రహదారులపై రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట నిమ్స్, అమీర్ పేట చౌరస్తా, మాదాపూర్, రామాంతపూర్, మెహిదీపట్నం, కూకట్ పల్లి తదితర   ప్రాంతాలు జలమయం అయ్యాయి. తొలకరి ప్రారంభం నుంచి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో ముఖ్యంగా సాయంత్రం, అర్థరాత్రిళ్ళు వర్షం పడుతోంది. దీంతో వాతావరణం చల్లబడుతోంది. 

https://www.photojoiner.net/image/jU1g8rTC

Image

Image

https://www.photojoiner.net/image/M1hOqA6p

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle