newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

సాఫ్ట్‌వేర్ శారదకు మరో కష్టం.. దుకాణంలో చోరీ

31-07-202031-07-2020 11:14:56 IST
2020-07-31T05:44:56.277Z31-07-2020 2020-07-31T05:44:51.969Z - - 07-08-2020

సాఫ్ట్‌వేర్ శారదకు మరో కష్టం.. దుకాణంలో చోరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీతంపోతే జీవితమే పోయినట్లు కాదు.. ఒకచోట అవకాశం పోతే.. మరోచోటు దొరుకుతుంది. ప్రయత్నించండి అంతే తప్ప ఆత్మహత్యలు మార్గం కానే కాదు అంటూ కరోనా సంక్షోభకాలంలో యావత్ సమాజానికి పాఠంలో నిలిచిన సాప్ట్ వేర్ శారదకు మరో కష్టం వచ్చిపడింది. చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం కరోనా సంక్షోభంతో పోయినప్పటికీ తల్లిదండ్రుల వృత్తిని నమ్ముకుని హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తూ ‘ డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ ’కు ప్రతీకగా నిలుస్తున్న శారద దుకాణంలో చోరీ జరిగింది. కుటుంబ పోషణ బరువును మోస్తున్న శారద కూరగాయల బండిని మొత్తంగా ఖాళీచేసిన దొంగలు ఆమెపై, ఆమె కుటుంబంపై మరో కష్టాన్ని మోపారు. 

మంగళవారం రాత్రి శారద తన దుకాణం మూసివేసి మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై ఉంచి కవర్‌తో కప్పి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం కూరగాయలు మాయయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.5 వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. 

తన తండ్రి హయాం నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి ప్యాక్‌ చేసి ఇంటికి వెళతామని, ఇప్పటివరకు  ఎప్పుడూ  దొంగతనం జరగలేదని ఆమె పేర్కొన్నారు.

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయినా ఎలాంటి కుంగుబాటుకు లోను కాకుండా హైదరాబాద్‌లో కూరగాయల దుకాణం నిర్వహిస్తూ అందరితో ప్రశంసలు పొందింది సాఫ్ట్‌వేర్ శారద. ఆమె కనబర్చిన పోరాట స్ఫూర్తికి సినీ నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఇస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరోమారు ఈ సాఫ్ట్‌వేర్ శారద వార్తల్లో నిలిచింది. 

ఎందుకంటే.. హైదరాబాద్‌లో ఆమె నిర్వహిస్తున్న కూరగాయల దుకాణంలో దొంగలు పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీలో పుట్‌పాత్‌పై సాఫ్ట్‌వేర్ శారద కూరగాయల దుకాణాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోజువారీ లాగే అమ్ముడు పోగా మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై ఉంచి కవరుతో కప్పి వెళ్లింది. అయితే ఉదయం వచ్చిచూసేసరికి కూరగాయాలను ఎవరో దొంగతనం చేసినట్టుగా గుర్తించారు.

అక్కడ కూరగాయలు ఏమీ లేవని, కేవలం ఖాళీ బండి మాత్రమే కన్పించింది. దాదాపు బండిపై రూ.5వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్టు శారద తెలిపింది. ఇదిలావుంటే.. తన తండ్రి కూరగాయలు విక్రయించేటప్పటి నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను రాత్రి సమయంలో బండిపైనే పెట్టి కవరు కప్పి వెళతారు. అయినా ఇప్పటివరకు ఎన్నడూ దొంగతనం జరగలేదని శారద వివరించింది.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ మనకు నచ్చినవే ఉండవు. ఎదురైన వాటిని యథాతథంగా స్వీకరించి తీరాల్సిందే.. అంటూ జీవితాన్ని తాత్వీకరించిన శారదకు ఈ కష్టకాలంలో అయిదువేల రూపాయల విలువైన కూరగాయలను  ఉన్నఫళంగా దొంగలు తీసుకెళ్లడం ఊహించని కష్టమే కావచ్చు.. కానీ ఆమె ఈ కష్టాన్ని కూడా తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలలో భాగంగానే భావించి భరిస్తుందని ఆశిద్దాం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle