newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

సాగర్ లో ప్రమాదం.. బయటపడ్డ స్కార్ఫియోలో ఆరు మృతదేహాలు

19-10-201919-10-2019 16:54:35 IST
2019-10-19T11:24:35.450Z19-10-2019 2019-10-19T11:24:30.656Z - - 15-11-2019

సాగర్ లో ప్రమాదం.. బయటపడ్డ స్కార్ఫియోలో ఆరు మృతదేహాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెళ్ళికి వెళ్లి వస్లూ ప్రమాదంలో నాగార్జున సాగర్‌ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనం బయటపడింది. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన స్కార్ఫియో కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించారు. ఇవాళ మధ్యాహ్నం వెలికితీశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం గురించి తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో చీకటి వల్ల కారు గాలింపు మందకొడిగా సాగింది. దీనికి తోడు సాగర్ ఉధృతంగా ప్రవహించడం కూడా వెలికితీత పనుల్లో జాప్యం జరిగింది.

ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. వెలికితీసిన వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉన్నాయి. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే గల్లంతయిన ఆరుగురి కుటుంబసభ్యులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు భోరున విలపించారు.

దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులను అబ్దుల్‌ అజిత్‌ (45), రాజేష్‌ 29), జాన్సన్‌ (33), సంతోష్‌ కుమార్‌ (23),నగేష్‌ (35) పవన్‌ కుమార్‌ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్ళి ఆరుగురు మిత్రులు విగతజీవులుగా పడి ఉండడంతొ అంకుర ఆస్పత్రి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle