newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

సమస్య ఏదైనా..ఆత్మహత్యే శరణ్యమా ?

16-09-202016-09-2020 14:07:20 IST
2020-09-16T08:37:20.115Z16-09-2020 2020-09-16T08:37:18.338Z - - 01-10-2020

సమస్య ఏదైనా..ఆత్మహత్యే శరణ్యమా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని, భార్య చనిపోయిందని, ప్రేమ విఫలమైందని, పరీక్ష ఫెయిల్ అయ్యామని, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఇలా సవాలక్ష సమస్యలతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా వెలుగు చూస్తున్న వరుస ఆత్మహత్యల సంఘటనలెన్నో ఉన్నాయి.

ఇండస్ట్రీలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. బాలీవుడ్ లో సుశాంత్, బుల్లితెర నటి శ్రావణి ల ఆత్మహత్యల కేసుల చిక్కుముడులు విప్పే పనుల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. అటు  బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు మళ్లీ డ్రగ్స్ కేసు వరకూ వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే రియాతో పాటు ఆమె సోదరుడు, నటీమణులు రాగిణి ద్వివేది, సంజనలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. రియాను విచారించిన అనంతరం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో రకుల్ పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇక్కడ సుశాంత్ కేసులో ప్రధానంగా వస్తున్న అనుమానం అతని ఆత్మహత్యకు  డ్రగ్సే కారణమా ? అని. చూస్తుంటే రియా నుంచి డ్రగ్స్ తీసుకోవడం వల్లే సుశాంత్ చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇక నటి శ్రావణి విషయానికొస్తే.. ఇద్దరు ప్రేమికుల ఒత్తిడితో నగిలిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ ఆర్ నగర్ పోలీసులు నిర్థారణ కొచ్చారు. ఈ కేసులో దేవరాజ్, సాయిలు అరెస్టవ్వగా మరో నిందితుడైన అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. శ్రావణి ఆత్మహత్యపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. ఒక అమాయకురాలిని ఇద్దరుదుర్మార్గులు బలి తీసుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రావణిని అవకాశాల కోసం వాడుకున్న దేవరాజ్ ఆఖరికి ఆమెను పెళ్లిచేసుకోనని చెప్పడం, ఇటు సాయి తననే పెళ్లి చేసుకోవాలని శ్రావణిని ఇబ్బంది పెట్టడంతోనే ఆమె బలన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

సెలబ్రిటీలే కాదు. సామాన్యులు కూడా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండ్రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అలాగే తన పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత వ్యక్తి ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇటు కరీంనగర్ లో మరో వ్యక్తి ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందన్న బాధతో పురుగుల మందు తాగి చనిపోయాడు. ఆ విషయాన్ని సెల్ఫ్ వీడియోలో వెల్లడించాడు.

ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఇలా చిన్న చిన్న కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం తమ సమస్యకు పరిష్కారం కాదంటున్నారు మానసిక వైద్యులు. ఏదైనా సమస్య ఉంటే దానిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాలి.. బలవన్మరణాలకు పాల్పడితే సమస్య అక్కడితో సమసిపోదని పేర్కొంటున్నారు.  

అమెరికా ఎన్నికలలో కీలక ఘట్టం.. ముఖాముఖిలో ట్రంప్ - బైడెన్ విమర్శలు

అమెరికా ఎన్నికలలో కీలక ఘట్టం.. ముఖాముఖిలో ట్రంప్ - బైడెన్ విమర్శలు

   6 hours ago


బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

   29-09-2020


వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

   29-09-2020


తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

   29-09-2020


పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   28-09-2020


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   28-09-2020


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   28-09-2020


గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

   26-09-2020


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle