newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

12-01-202012-01-2020 10:32:17 IST
Updated On 12-01-2020 10:32:11 ISTUpdated On 12-01-20202020-01-12T05:02:17.751Z12-01-2020 2020-01-12T05:01:36.710Z - 2020-01-12T05:02:11.459Z - 12-01-2020

సంక్రాంతి  బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శివరాత్రితో పాటు జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  జనవరి 12వ తేదీనుంచి 18వ తేదీ శనివారం వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. మల్లికార్జున స్వామివారికి ఏటా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. 

సంక్రాంతి సందర్భంగా ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు శ్రీశైలానికి వస్తుంటారు. దీంతో వసతి ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle