newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

శ్రీరామనవమి విశిష్టత

14-04-201914-04-2019 09:58:16 IST
Updated On 14-04-2019 09:58:30 ISTUpdated On 14-04-20192019-04-14T04:28:16.566Z14-04-2019 2019-04-14T04:28:05.743Z - 2019-04-14T04:28:30.313Z - 14-04-2019

శ్రీరామనవమి విశిష్టత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేసవికాలం ప్రారంభం అయిందంటే చాలు శ్రీరామనవమి సందడి కనిపిస్తుంది. ప్రతి రామాలయంలో శ్రీరామనవమి కోసం భారీ ఏర్పాట్లు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో శ్రీసీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సకల గుణాభిరాముడు శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామునికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. 

రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడని రామాయణం చెబుతోంది. ఆరోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది.  నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా ప్రజలు ఉత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతారు.

శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రసాదం వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం దాగి వుంది. వేసవి వల్ల వచ్చే అనేక ఇబ్బందులను ఈ ప్రపాదం వల్ల అధిగమించవచ్చు. 

శ్రీరాముడి పాలన నేటి పాలకులకు ఆదర్శంగా చెబుతారు. ప్రజానురంజకంగా పాలించడం అంటే శ్రీరాముడి దగ్గరే నేర్చుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధి కూడా దేశం రామరజ్యంలా సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. నేటి పాలకులు తరచూ రామరాజ్యం తెస్తానని చెబుతుంటారు. సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు  సకలగుణాభిరాముని లక్షణాలు తెలుసుకుంటే బావుంటుంది. 

శ్రీరామునికి ఉన్న 16 ఉత్తమ లక్షణాలు : *క్రమశిక్షణ * వీరుడు, సాహసికుడు * వేదాంతి * కృతజ్ఞత కలిగినవాడు * సత్యవాక్కు పరిపాలకుడు *సకల గుణవంతుడు *స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని * సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు *అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు *సమస్తకార్యాలలోను సమర్ధుడు * మంచి లక్షణాలు కలిగిన అందగాడు *అత్యంత ధైర్యవంతుడు *క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంతచిత్తుడు *సమస్తలోకాల్లోనూ తెలివైనవాడు *అసూయ లేని వాడు * దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.. ఈ లక్షణాల్లో ఎన్ని ఈనాటి పాలకులకు ఉన్నాయో.. ఎవరికి వారు ఆలోచించుకోవాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle