newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

శరీర బరువును అదుపులో ఉంచే ఫుడ్

14-03-201914-03-2019 07:39:52 IST
2019-03-14T02:09:52.240Z14-03-2019 2019-03-14T01:54:17.491Z - - 26-05-2019

శరీర బరువును అదుపులో ఉంచే ఫుడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే బరువు పెరుగుతామని చాలామంది భయపడతారు. తమకిష్టమయిన ఆహారాన్ని కూడా వదులుకుంటుంటారు. అయితే కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూర్చడంతో పాటు బరువు టెన్షన్ కూడా ఉండదంటున్నారు పోషకాహార నిపుణులు. 

వీటిలో ప్రోటీన్స్, పీచు పదార్ధాలు సెనగలలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే.. తొందరగా ఆకలి కూడా వేయదు. కాబట్టి  సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అధిక బరువును తగ్గించడానికి ఓట్స్ బాగా పని చేస్తాయి. ఓట్స్ శరీరంలోని కొవ్వును బాగా కరిగించేస్తాయ. ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఓట్స్ మీల్ మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది

అలాగే కూరగాయ ముక్కలు, నిమ్మరసం, ఉడికించిన సెనగలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మొలకెత్తిన విత్తనాలు.. వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

తక్కువ బడ్జెట్ లోనే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మీలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా పేరుకుపోవు. అలాగే అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధించదు. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాటచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగాలి. క్యారెట్స్ కూడా బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి. వీటిని నేరుగా గానీ, లేదంటే కూరలుగా చేసుకుని గానీ, లేదంటే జ్యూస్ లాగా తాగొచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగానూ, పీచు పదార్థం ఎక్కువగానూ ఉంటుంది. స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు బొప్పాయి ముక్కలు తినండి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle