newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

21-05-202021-05-2020 18:06:17 IST
Updated On 21-05-2020 18:14:22 ISTUpdated On 21-05-20202020-05-21T12:36:17.853Z21-05-2020 2020-05-21T12:36:05.437Z - 2020-05-21T12:44:22.114Z - 21-05-2020

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.  గురువారం ఉదయం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో   పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ప్రమాదంలో దంపతులతోపాటు మరో మహిళ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం  వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని   వెనుక నుంచి ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య లక్ష్మీ(30)తోపాటు మరో లక్ష్మీచందన(28) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు సహా కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

తెలంగాణలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో మొండెం నుండి తల తెగిపడటంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన మన్నే దుర్గయ్యగా గుర్తించారు. దుర్గయ్య రాంపూర్ వద్ద ఉన్న రైస్ మిల్ లో గుమస్తాగా విధులు నిర్వహిస్తున్నారు.

దుర్గయ్య తన గ్రామం ఉత్తులూర్ నుండి రైస్ మిల్ కు వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడానికి కారణమైన ట్రాక్టర్ అదే రైస్ మిల్ కి చెందినది కావడం దురదృష్టకరం. ట్రాక్టర్ ను బైక్ పై వెళ్తున్న దుర్గయ్య వేగంగా వెళ్లి ఢీకొనడంతో ఈ ప్రాణ నష్టం సంభవించింది. జరిగిన ప్రమాదం గురించి మృతుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడు దుర్గయ్య కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన సంఘటన తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle