newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

విషాదం.. పెట్రోల్ బంకులో కరెంట్ షాక్ -ముగ్గురి మృతి

18-01-202018-01-2020 17:47:26 IST
2020-01-18T12:17:26.311Z18-01-2020 2020-01-18T12:17:23.646Z - - 26-02-2020

 విషాదం.. పెట్రోల్ బంకులో కరెంట్ షాక్ -ముగ్గురి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. పెట్రోల్‌ బంకులో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి పక్కనున్న పెట్రోల్‌ బంకులో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులో ఇనుప స్టాండ్‌ సాయంతో  విద్యుత్‌ బల్బు మారుస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో విద్యుత్‌ వైరు ఇనుప స్టాండ్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమాదంలో మృతులను డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్‌ మౌలాలి(22) గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శేఖర్‌ (48) ప్రాణాలు కోల్పోయాడు. మృతులు బొప్పూడి, పోలిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు. ఈ సంఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle