newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

21-05-202021-05-2020 09:11:15 IST
Updated On 21-05-2020 10:16:36 ISTUpdated On 21-05-20202020-05-21T03:41:15.874Z21-05-2020 2020-05-21T03:40:52.543Z - 2020-05-21T04:46:36.589Z - 21-05-2020

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి.  వివాహిత మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. మెదక్ జిల్లా మసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. ప్రియుడుతో కలసి రైలుకు ఎదురుగా వెళ్ళి వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అటు ప్రియుడు, ఇటు ఆమె ముక్కలైపోయారు. ఆత్మహత్య దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. 

మల్కాజిగిరి కి చెందిన సంతోషిని  కనిపించడం లేదంటూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఆమె భర్త శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్  కేసు నమోదు చేసారు. సంతోషిని  గతకొన్ని రోజులుగా ఎప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉండటంతో భర్త శంకర్ కు అనుమానం వచ్చి భార్యను నిలదీశాడు. అదే విషయంలో  భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఉదయమే ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో చుట్టుపక్కల వెతికి భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలేం జరిగిందంటే.. మల్కాజిగిరి కి చెందిన సంతోషిని, శంకర్ భార్యాభర్తలు 10 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. భర్త కారు డ్రైవర్ గా ప్రైవేట్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఐదు సంవత్సరాల క్రితం సంతోషిని మల్కాజిగిరి లోని అనుటెక్స్ బట్టల షోరూములో సేల్స్ గర్ల్ గా రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది. ఇక్కడే ఆమెకు రవి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఆమె ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. 

రవి కుమార్ కూడా అక్కడ ఉద్యోగం వదిలి  మెడిప్లస్ మందుల దుకాణంలో ఉద్యోగం పనిచేస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అయితే మళ్ళీ ఈమధ్యనే వీరు ఒకనొకరు కలుసుకోవడంతో  పాత ప్రేమ బయటకు వచ్చి ఫోన్లో చాటింగ్ చేయడం, మాట్లాడటం, కలవడం మొదలుపెట్టారు. ప్రియుడు రవి కుమార్ కు కూడా వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

భర్తతో గొడవ పడ్డ సంతోషిని ఇల్లు విడిచి ప్రియుడు రవి కుమార్ తో కలిసి మసాయిపేట రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి వుండే పరిస్థితి లేకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల గురించి ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లి అత్మహత్య చేసుకున్నారు.  ఒక వివాహేతర సంబంధం వలన రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంతోషిని పిల్లలు తల్లికి, రవికుమార్ పిల్లలు తండ్రికి దూరమయ్యారు. దీంతో పిల్లలు ఇప్పుడు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle