newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

వావ్ వాటెన్ ఐడియా.. బియ్యం బస్తాల్లో మద్యం బాటిళ్ళు

28-06-202028-06-2020 19:23:00 IST
2020-06-28T13:53:00.173Z28-06-2020 2020-06-28T13:47:22.249Z - - 11-07-2020

వావ్ వాటెన్ ఐడియా.. బియ్యం బస్తాల్లో మద్యం బాటిళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యంబాబులు ఏ అవకాశాన్నీ వదులుకోరు. ఎక్కడ ఎలాంటి మద్యం దొరుకుతుందో వారికి తెలుసు. అక్రమార్కులు కూడా మద్యం ఎక్కడ దొరికినా ఏదో ఒక మార్గంలో వాటిని రాష్ట్రానికి తెచ్చేస్తున్నారు. ఏపీలో బియ్యం బస్తాల్లో మద్యం బాటిళ్లు తెస్తూ అడ్డంగా దొరికిపోయారు. నూతన పద్ధతుల్లో అక్రమ మద్య రవాణాకు తెగబడుతున్న మద్యం రాయుళ్లకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఏపీలో ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణా గుట్టురట్టు చేస్తున్నారు పోలీసులు. 

బియ్యం బస్తాల్లో మద్యం రవాణా చేస్తే ఎలాంటి ప్రాబ్లం వుండదని ఏకంగా 371 మద్యం సీసాలు రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ నుండి గుంటూరు జిల్లా నూకలపేటకు మద్యం బాటిళ్లు తరలిస్తూ దబ్బాకుపల్లి వద్ద పట్టుబడ్డారు ముగ్గురు వ్యక్తులు. రెండు ద్విచక్ర వాహనాల సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ అక్రమ మద్యం రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్న ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ మద్యం రవాణా దారుల తాట తీస్తున్నారు.

మరోవైపు కళ్లుగప్పి తప్పించుకు పోవచ్చులే అన్న పంథాతో , అక్రమ లాభార్జనే ధ్యేయంగా తెగబడుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. పోలీసులు పసిగట్టరనే నమ్మకం, దురాలోచనతో మద్యం రవాణా దారులు వాటర్ క్యాన్లలో, ఉల్లిపాయల సంచుల్లో, అంబులెన్స్, పశువుల గడ్డి మోపులో ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నందిగామ సాండ్ మొబైల్ సిబ్బంది వత్సవాయి మండలంలోని దబ్బాకుపల్లి డొంక రోడ్డు వద్ద కాపు కాశారు. 

గుంటూరు నూకల పేట, అందుకూరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బియ్యం బస్తాలతో తెలంగాణ నుండి గుంటూరు జిల్లా వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసు సిబ్బంది బియ్యం బస్తాలపై అనుమానం వచ్చి వాటిని తనిఖీ చేశారు. రెండు బియ్యం బస్తాలు ఒక బ్యాగ్ లో మొత్తం 371 మద్యం బాటిల్ గుర్తించారు పోలీసులు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, 80 కేజీల బియ్యం, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వాహన తనిఖీ లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సుధాకర్,  గోపి, వెంకటేష్ లను నందిగామ డిఎస్పి రమణ మూర్తి ప్రత్యేకంగా అభినందించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle