newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

వానాకాలం తినకూడని ఆహారపదార్ధాలివే!

29-06-202029-06-2020 09:46:45 IST
2020-06-29T04:16:45.516Z29-06-2020 2020-06-29T04:16:35.023Z - - 11-07-2020

వానాకాలం తినకూడని ఆహారపదార్ధాలివే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు వాన చినుకులు.. వేడి వేడి ఆహారం తినాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ సమయంలోనే రోడ్డుపక్కన వేడివేడి పకోడీలు, బజ్జీలు నోరూరిస్తాయి. వీటిని తినడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇవి చాలామందికి వానాకాలం ఫేవరెట్ ఫుడ్స్. అయితే వానాకాలం ఇవి​ తినవచ్చా? వీటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి. వానాకాలం తినకూడని పదార్థాలు ఇంకా ఏమైనా వున్నాయా? 

జంక్ ఫుడ్స్ అసలొద్దు

వానాకాలంలో జీర్ణవ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ వుంటాయి. జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బేకరీ ఫుడ్స్ తినకూడదు. వాతావరణం చల్లబడ్డప్పుడు వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినకుండా ఉండలేరు చాలామంది. కానీ, వీటిని ఎక్కువగా తినకూడదు. ఈ సీజన్​లో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీప్​ ఫ్రై చేసిన పదార్థాలు తింటే దగ్గు, ఎసిడిటీలాంటి సమస్యలు వస్తాయి. ఈ సీజన్​లో బజ్జీలు, పకోడీలు ఎక్కువగా తినకూడదు. నాన్​వెజ్​ ఐటమ్స్​ కూడా ఎంత తక్కువగా తింటే అంత మంచిది. మోతాదు మించితే జీర్ణక్రియ మీద భారం పడి చాలా సమస్యలొస్తాయి. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వుంటుంది.

ఫ్రూట్ సలాడ్స్​

కాలం ఏదైనా కొంతమంది సలాడ్స్​ని ఇష్టంగా తింటుంటారు. వర్షాకాలంలో ఎక్కువ కాలం నిల్వ వున్న సలాడ్స్ తినకూడదు. గాలిలో తేమ ఉండటం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయ ముక్కల్ని కోసి పెడితే తేమ వల్ల క్రిములు వాటిమీదకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్​లో సలాడ్స్​ తినాలనుకుంటే అప్పటికప్పుడు కోసుకుని తినాలి. ఫ్రూట్స్ కొన్నవి ఫ్రిజ్ లో వుంచి బయటకు తీసి వాటిని అప్పటికప్పుడు కట్ చేసుకుని తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

చేపలు, రొయ్యలు 

వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ అవి అంత సులభంగా పోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండిస్, డయేరియా వంటివి వచ్చే ప్రమాదముంది. వీటివల్ల ఊపిరికి, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో బలహీనంగా ఉండే మన జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే వర్షాకాలంలో చేపలు తినకపోవడమే మంచిది. రొయ్యలు కూడా అంతే. 

కారం, ఉప్పు, వేపుళ్ళు తగ్గించుకోవాలి 

వర్షాకాలం నోటికి కాస్త కారం వుండేవి తినాలనిపిస్తుంది. అందుకే చాలామంది వేపుళ్ళు, కారం తిండి ఎక్కువగా తింటుంటారు. ఈ సీజన్​లో అలర్జీలు కూడా ఎక్కువగానే వేధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కూరల్లో కాస్త కారం తగ్గించడం మంచిది. అలర్జీలకు ఎక్కువగా గురయ్యే వాళ్లు కారం తగ్గించాలి. లేదంటే అవి ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది.

పాలు, పెరుగు మంచివేనా? 

పాలు ఆరోగ్యానికి మంచివే. అయితే వాతావరణం కూల్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా తీసుకోకూడదు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండి జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే ఈ కాలం ఎక్కువగా పాలు తాగకూడదు. ఒకవేళ రోజుకొక గ్లాసు పాలు తీసుకోవాలనుకుంటే అందులో చిటికెడు పసుపు వేసుకునే తాగాలి. పాలు, పాలపదార్ధాలతో పాటు పెరుగు కూడా తగ్గించడం మంచిది. అలర్జీ, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మైగ్రేన్‌‌‌‌‌‌‌‌ తలనొప్పి, సైనసైటిస్‌‌‌‌‌‌‌‌.. లాంటి సమస్యలున్న వాళ్లు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుంది. అలాంటి సమస్యలున్న వాళ్లు చల్లటి పదార్థాల జోలికి వెళ్లకపోతే మంచిది. పాల ఉత్పత్తులు, ఐస్‌‌‌‌‌‌‌‌క్రీమ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండటం ఉత్తమం. ఒక్కోసారి పెరుగు తినడం వల్ల చలువ పెరిగి జలుబుచేస్తుంది. అది తలనొప్పిగా మారి ఇబ్బందిపెడుతుంది.

మామిడి పండ్లు తినవచ్చా? 

మండేవేసవిలో నోరూరించే మామిడిపళ్ళు దొరుకుతాయి. ఎండాకాలం మామిడి పండ్లు తిన్నా ఫర్వాలేదు. కానీ వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో వాటిని తినడం మంచిది కాదు. పండ్లలో పురుగులు ఉండే ప్రమాదం ఉంది. అలాంటివి తింటే గ్యాస్ట్రిక్​ సమస్యలు వస్తాయి. 

పానీ పూరి వద్దేవద్దు

కరోనా సంక్షోభం వేళ లాక్ డౌన్ విధించడంతో ఛాట్ భండార్లు పానీపూరీ బండ్లు మూతబడ్డాయి. పానీపూరీ తినడం వల్ల గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడం మంచిది కాదు. పానీపూరీ వాటర్ కలిపేటప్పుడు శుభ్రంగా ఉండకపోవచ్చు. దానివల్ల కడుపులో గడబిడ మొదలైతే… ఆ తిప్పలు తలుచుకుంటే పానీపూరికి దూరంగా ఉంటారు. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తిన్నది జీర్ణమవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది. ఎక్కువగా వేడినీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. 

గ్రీన్, బ్లాక్, జింజర్ టీ మంచిది

అస్తమాను కాఫీ, టీలకు బదులు గ్రీన్, బ్లాక్, జింజర్ టీ తాగడం మంచిది. అలాగే శరీరానికి మంచి పోషకాహారం అవసరం. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు,  రాగులు, సోయాబీన్‌‌‌‌‌‌‌‌, పెసలు, మొక్కజొన్న లాంటివి తినాలి.  అల్లం, మిరియాలు, తేనె కలుపుకొని టీ తయారుచేసుకోవాలి. పుదీనా, తులసి ఆకులు కూడా కలిపితే మంచిది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌, యాంటీ వైరల్‌‌‌‌‌‌‌‌ గుణాలుంటాయి.

శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న కూరగాయలు, పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. దానిమ్మ, యాపిల్‌‌‌‌‌‌‌‌, స్ట్రాబెర్రీ, అరటి లాంటి పండ్లను తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు తినే ముందు తప్పనిసరిగా వాటిని ఉప్పు నీటీలో శుభ్రంగా కడిగితే వాటిమీద ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle