newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వసంత పంచమి... ఎందుకంత స్పెషల్!

09-02-201909-02-2019 13:52:22 IST
Updated On 09-02-2019 15:16:10 ISTUpdated On 09-02-20192019-02-09T08:22:22.512Z09-02-2019 2019-02-09T08:22:20.148Z - 2019-02-09T09:46:10.534Z - 09-02-2019

వసంత పంచమి... ఎందుకంత స్పెషల్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వసంత పంచమిగా పిలువబడే మాఘ శుద్ధ పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈదినమే చదువుల తల్లి ‘‘సరస్వతి జయంతి’’గా కొన్నిచోట్ల భావిస్తారు. దీనిని ‘‘సరస్వతి పూజాదినంగా, శ్రీపంచమి, మదన పంచమి, రతి కామ దమనోత్సవ పర్వదినం’’గా పంచాంగ కర్తలు చెబుతారు. వసంత పంచమి నామాన్ని బట్టే దీనిని రుతు సంబంధమైనదిగా భావించవచ్చు. మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఆకాలంలోనే క్రమంగా వసంత రుతు లక్షణాలైన చెట్లు చిగురించడం, పూలు పూయడం కనిపిస్తుంది. మాఘ మాసమే వసంత రుతువుకు ఆరంభమనే వాదన వకూడా ఉంది. వసంతోత్సవ ఆరంభానికి వసంతి పంచమినే కొందరు పంచాంగ కర్తలు ఉదహరిస్తారు. రాగల వసంత రుతువుకు శిశిరంలోనే స్వాగతించే పండుగ ఇది. 

వసంత (బసంత) పంచమి నాడు నూతన వస్త్రాలు, తైల స్నానాలు ప్రధానాలని చెప్పబడింది. నూతన వస్తధ్రారులై, బుక్కా, వసంతం చల్లుకునే పండుగ అయినందునే వసంత పంచమి అంటారు. ‘‘నవాన్న భక్షణ దినం’’గా, సంక్రాంతికి వచ్చే ధాన్యాన్ని ఈరోజు అన్నం వండి కులదేవతలకు నివేదించి తినే ప్రాచీన ఆచారమూ కొన్ని ప్రాంతాలలో ఉంది. ప్రాచీన కాలంలో రోమనులు కూడా ‘‘వసంతరుతు పండుగ’’ను ఇదే రోజు, ఇదే మాదిరిగా చేస్తుండే వారని చెబుతారు. బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయంలో అన్ని శక్తులలో ప్రధానమైన శక్తిగల సరస్వతిని వసంత పంచమినాడు పూజించాలని పేర్కొనబడింది, కనుక వసంత పంచమి విద్యారంభ దినం. 

(ఆదివారం ఫిబ్రవరి 10, వసంత పంచమి పర్వదినం)

విద్యకు అధిదేవతయైన సరస్వతిని మాఘ మాసమందు తాటియాకులు, గంటము, గ్రంథములాది విద్యా సాధనములను దేవి ఎదుట ఉంచి గంధ పుష్పాదులతో గ్రంథ రచన ప్రారంభ సమయంలో పూజించే ఆచారం ఉందని సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. సరస్వతీదేవి అహింసాదేవి. ఆయుధాలు ఏమీ ధరించని దేవత. తెల్లటి పద్మం మీద సరస్వతి నిలబడి ఉన్నట్లు, ఒకకాలు నిలువుగాను, మరొకకాలు దానిమీద అడ్డంగాను ఉంచుకుని, ఒకచేత వీణ, మరొకచేత పుస్తకము ధరించి ఉన్నట్లు పద్మ పురాణ లిఖితం. తెల్లటి బట్టలు ధరించి, తెల్లటి పూలు, తెల్లపూసల కంఠహారం, దానిపై తెల్లగంధం పూత, తెల్లని వీణాపాణితో కూడిన ప్రశాంత, శాంతి దేవత సరస్వతి. పూజా సందర్భంలో చదువుకు, వ్రాతకు, సంగీతానికి సంబంధించిన పరికరాలను ఆమె ముందుంచడం అనవాయితీ.

పసుపు పచ్చని బట్టలు ధరించి, సరస్వతికి రోజంతా పూజలు నిర్వహిస్తూ, కీర్తనలు పాడడం సనాతన సాంప్రదాయం. వసంత పంచమి నాటికే మామిడి తదితర చెట్లు బాగా చిగురించి కాపు ప్రారంభం అవుతుంది. పైరుగాలికి అవి పిందెలుగా మారుతాయి. చలికాలం క్రమేపీ మాయం అవుతుంది. ఇదిలా ఉంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పిల్లల అక్షరాభ్యాసాల కోసం తల్లిదండ్రులు బాసరకు చేరుకుంటున్నారు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తే విద్యాబుద్ధులు బాగా వస్తాయని ప్రతీతి. 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   16 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle