newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వరలక్ష్మీ దేవీగా బెజవాడ దుర్గమ్మ దర్శనం

31-07-202031-07-2020 09:03:20 IST
2020-07-31T03:33:20.497Z31-07-2020 2020-07-31T03:31:32.856Z - - 07-08-2020

వరలక్ష్మీ దేవీగా బెజవాడ దుర్గమ్మ దర్శనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రావణ మాసం పరమ పవిత్రం. రెండవ శుక్రవారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి పై వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దేవస్ధానం వారిచే వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత  వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలు కోవిడ్ వల్ల రద్దు...భక్తులకు పూజల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించారు దుర్గగుడి అధికారులు. 

వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా  గోత్రనామాలతో జరిపేందుకు మాత్రమే అవకాశం కల్పించారు దుర్గగుడి అధికారులు. వరలక్ష్మీ దేవి దర్శనార్దం తరలివస్తున్నారు భక్తులు. వరలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట‌రమణ.

మామూలుగా వరలక్ష్మీ వ్రతం వేళ అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి ఎక్కువగా వుంటుంది. అయితే ఈఏడాది కరోనా మహమ్మారి వల్ల ఆ సందడి కనిపించడం లేదు. కరోనా వ్యాప్తి, కోవిడ్ 19 నిబంధనలతో భక్తులు తమ ఇళ్ళలోనే అమ్మవారి పూజలు నిర్వహించుకోవాలని దేవస్థానం కోరింది. దీంతో ఆలయంలో అధికారులు, సిబ్బంది, పరిమిత సంఖ్యలో వీఐపీలు కనిపించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle