newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వరద బీభత్సం.. అసోంలో 107 మంది మృతి

30-07-202030-07-2020 20:08:16 IST
2020-07-30T14:38:16.594Z30-07-2020 2020-07-30T14:33:09.268Z - - 07-08-2020

వరద బీభత్సం.. అసోంలో 107 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో ఈశాన్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. బ్రహ్మపుత్ర నదితో సహా మరికొన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. వరదల వల్ల ఇప్పటి వరకు 107 మంది మరణించగా, 5,305 గ్రామాలకు చెందిన 56,71,031 మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అసోం రాష్ట్ర విపత్త నిర్వహణ సంస్థ పేర్కొంది. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలు భారీవర్షాలవల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్రహ్మపుత్ర నది ఉదయం పలు ప్రాంతాల్లో డేంజర్‌ లెవల్‌ను ధాటి ప్రవహిస్తోంది. కజిరంగా జాతీయ పార్కులో వరదల ఉధృతికి సుమారు 150కి పైగా వన్యప్రాణులు మృతిచెందాయి. గడచిన కొద్ది రోజులుగా అసోంలో సంభవించిన వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులు కాగా.. దీని ప్రభావం దాదాపు 28 లక్షల మందిపై పడినట్టు తెలుస్తోంది. 

Image

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. వరద బాధిత గ్రామాల్లో పడవల సహాయంతో అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతేడాది వరదలకు పెద్ద ఎత్తున వన్యప్రాణాలు మృత్యువాత పడ్డాయని.. ఈ సారి స్పీడ్ బోట్లతో పాటు.. వన్య ప్రాణులను రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ అక్కడ కూడా వరదలు రావడంతో భారీస్థాయిలో నష్టం వాటిల్లింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle