newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

వడదెబ్బతో కేరళ ఎక్స్ ప్రెస్‌లో నలుగురి మృ‌తి

11-06-201911-06-2019 18:43:18 IST
2019-06-11T13:13:18.764Z11-06-2019 2019-06-11T13:13:16.152Z - - 20-09-2019

 వడదెబ్బతో కేరళ ఎక్స్ ప్రెస్‌లో నలుగురి మృ‌తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎండా కాలం అయిపోయి వర్షాకాలం వచ్చినా.. ఇంకా సూరీడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. రోడ్లమీద జనసంచారం కూడా బాగా తగ్గిపోయింది. రెండు వారాలుగా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి రైలులో వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఆగ్రా నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు ఎండ దెబ్బకు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో ఝాన్సీ వద్ద వారంతా మరణించారు. వడదెబ్బతోనే వీరు మరణించారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం బాధితులు ప్రయాణిస్తున్న రైలు ఝాన్సీకి చేరుకుంటుండగా ప్రయాణీకుల్లో ఒకరు స్పృహ కోల్పోయారని తమకు సమాచారం అందిందని, తాము వైద్య సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అప్పటికే ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ప్రయాణీకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

ఝాన్సీలో ఇటీవల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. తాము ఆగ్రా దాటిన వెంటనే ఎండ వేడిని భరించలేకపోయామని, కొందరికి శ్వాస సమస్యలు తలెత్తగా మరికొందరు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశారని కొందరు ప్రయాణికులు చెప్పారు. ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడారి ప్రాంతం రాజస్ధాన్‌లో రికార్డుస్ధాయిలో 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle