newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..సైరా ఆర్టిస్ట్ మృతి

16-05-201916-05-2019 15:44:59 IST
2019-05-16T10:14:59.228Z16-05-2019 2019-05-16T10:14:56.568Z - - 21-08-2019

వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..సైరా ఆర్టిస్ట్ మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంతకుముందు రెండుమూడు రోజులు కురిసిన అకాల వర్షాలకు కాస్త వేడి తగ్గినా.. ఉక్కపోత తీవ్రత పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండతాకిడికి ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్యం సమయంలో బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలతో పాటు రోజువారీగా కూలీనాలీ చేసుకునేవా రంతా ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.

దీంతో వారంతా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటూ తమ పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే పేదవాడి ఫ్రిజ్‌గా పిలువబడే కుండలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున జ్యూస్‌ సెంటర్లు వెలిశాయి. ఇంకా యువకులు, ఉద్యోగులు, ఇతర వర్గాలవారు ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే...ఎండ తీవ్రతకు ఓ రష్యన్‌ వ్యక్తి మృతి చెందాడు. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్‌ టూరిస్ట్‌ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పోలీసులు వెంటనే కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అలెగ్జాండర్‌ చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. అతని కెమేరాలోని ఫోటోలను బట్టి అతని వివరాలు తెలిశాయి.

ఈఘటనకు ముందు సైరా సినిమాలో సైడ్‌ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్, ఈ నెల 10 హోటల్‌ నుంచి ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్‌ మృతి చెందాడని, గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. 

రాష్ట్రంలో వడదెబ్బతో జనం పిట్టల్లా రాతుతున్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో ఇద్దరు, సూర్యాపేట జిల్లాలో నలుగురు, కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు, కుమ్రంభీ ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి,నిజామాబాద్‌ జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం కూర గ్రామంలో పెళ్లి అయిన ఐదు రోజులకే ఓ యువకుడు వడదెబ్బతో చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. 

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   17 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   21 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle