facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

లిఫ్ట్‌లో రాసలీలలు తప్పే... మరి ‘మెట్రో’ చేసిందేంటి?

09-02-201909-02-2019 13:46:26 IST
Updated On 09-02-2019 13:48:15 ISTUpdated On 09-02-20192019-02-09T08:16:26.350Z09-02-2019 2019-02-09T08:16:24.505Z - 2019-02-09T08:18:15.557Z - 09-02-2019

లిఫ్ట్‌లో రాసలీలలు తప్పే... మరి ‘మెట్రో’ చేసిందేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో టీనేజర్స్ పాల్పడ్డ రాసలీలల వీడియోల్ని ఈమధ్యే మెట్రో సిబ్బంది విడుదల చేసిన విషయం తెలిసిందే! మెట్రో స్టేషన్లలో ప్రతిచోటా సిసిటివి కెమెరాలుంటాయని తెలిసినప్పటికీ... ఏకాంతం దొరికిందనే ఆవేశంలో వాటిని గమనించకుండా వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వాళ్ళు అలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం ముమ్మాటికీ తప్పే!

కానీ... మైనర్స్ అయిన వారి ఐడెండిటీని గోప్యంగా ఉంచకుండా బహిర్గతం చేసి, మెట్రో అంతకుమించిన పొరపాటు చేసింది. నిజానికి... మైనర్లు ఎంత పెద్ద నేరం చేసినా, వారి ఐడెంటిటీని బయటపెట్టకూడదు. ఒకవేళ బహిర్గతం చేస్తే... అది ‘నేరం’ కిందకే వస్తుంది. అందుకే... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితుల్లో ఒకరైన మైనర్ బాలుడి వివరాలు ఇంతవరకూ బయటకు రాలేదు. అతనెవరు, ఎలా ఉంటాడనే వివరాల్ని అధికారులు రివీల్ చేయలేదు. బాలల హక్కులకు ఇచ్చే ప్రాముఖ్యం అలాంటిది.

కానీ... మెట్రో సిబ్బంది మాత్రం ఆ నిబంధనని ధిక్కరించి, మైనర్ల రాసలీలల ఫుటేజ్‌లను అత్యుత్సాహంతో విడుదల చేశారు. చివరికి... అన్నీ తెలిసిన మీడియావాళ్ళు కూడా మెట్రో సిబ్బందిలాగే అదే అత్యుత్సాహం ప్రదర్శించి, వారి ఐడెంటిటీని దాచకుండా రివీల్ చేసేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనివల్ల ఆ విద్యార్థులు చాలా సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారి కెరీర్‌లపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపొచ్చు.

ముఖ్యంగా... అమ్మాయిల పరిస్థితి గందరగోళంగా మారినట్టే! మెట్రో సిబ్బంది చేసిన ఈ తప్పు వల్ల ఆయా విద్యార్థుల పరువుతో పాటు కుటుంబ గౌరవం కూడా రోడ్డున పడినట్లయింది. దీంతో మెట్రో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బాలల హక్కుల సంఘంతో పాటు మానవ హక్కుల సంఘం కూడా మెట్రో తీరుని తప్పుపడుతున్నారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం! ఒకవేళ ఇదే జరిగితే... మెట్రో కొత్త చిక్కుల్లో పడ్డట్టే!

మెట్రో లిఫ్ట్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిసిన మెట్రో సిబ్బంది... ఇలా వీడియోలు బయటపెట్టడం కంటే, మరో విధమైన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని కొందరు సూచిస్తున్నారు. లిఫ్ట్ దగ్గర, అలాగే లోపల సెక్యూరిటీ గార్డ్స్‌ని ఏర్పాటు చేస్తే... ఈ సమస్య తలెత్తేది కాదంటున్నారు. ఏదేమైనప్పటికీ... మెట్రో సిబ్బంది తప్పుకి ఆ మైనర్ల జీవితాలు ఇబ్బందుల్లో పడినట్టే! ఇకనుంచైనా మెట్రో ఇటువంటి అత్యుత్సాహ పనులకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సలహాలిస్తున్నారు.

ఈ ఉదంతంపై బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావ్ ‘‘న్యూస్‌స్టింగ్‌’’తో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘‘ఆ మైనర్ల ఐడెంటిటీ గోప్యంగా ఉంచకుండా బహిరంగ పరచడం సమంజసం కాదన్నారు. దీనివల్ల ఆయా కుటుంబాలకు ఇబ్బందులు ఏర్పడుతాయని ఆయనన్నారు. ఇలాంటి సున్నితమైన వీడియోలు విడుదల చేసేముందు అధికారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల’’న్నారు. ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు బ్లర్ చేయడం తప్పనిసరి అని చట్టం చెప్తోందన్నారు. దాన్ని ఆచరించకపోవడం మెట్రో చేసింది ముమ్మాటికి పొరపాటేనన్నారు.

Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle